రెచ్చిపోయిన సురేఖావాణి కూతురు.. బాల్కనీలో డేంజరస్‌గా సుప్రిత (వీడియో)
హీరోయిన్ కాకపోయినప్పటికీ కేవలం సోషల్ మీడియాను అస్త్రంగా మార్చుకొని హీరోయిన్ రేంజ్ క్రేజ్ సంపాదించింది సురేఖావాణి కూతురు సుప్రిత. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంది. ఎప్పటికపుడు సరికొత్త స్టఫ్‌తో ఆన్ లైన్ మాధ్యమాలను హీటెక్కించే ఈ బ్యూటీ.. తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేసింది. సుప్రిత అందాలు హైలైట్ అవుతున్న ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. అయితే ఇది చూసిన నెటిజన్లు కామెంట్ల ప్రవాహం పారిస్తున్నారు.

తల్లితో సుప్రిత ఎంజాయ్
తన తల్లి సురేఖావాణితో కలిసి సుప్రిత చేసే ఎంజాయ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. పలు లొకేషన్స్ తిరుగుతూ చిల్ అవుతుంటారు. దేశవిదేశాల్లో ఎక్కడ చూసినా ఈ తల్లీకూతుళ్ల హవానే కనిపిస్తుంటుంది. దీంతో తల్లి సురేఖావాణితో పాటు కూతురు సుప్రిత ఫేమస్ అయింది.

డాన్స్ వీడియోలతో రచ్చ
సురేఖావాణి- సుప్రితలను ఇంతలా ఫేమస్ చేసింది డాన్స్ వీడియోలే అని చెప్పుకోవాలి. లుంగీ కట్టి చిందేసి సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ తల్లీబిడ్డలు అదే బాటలో వెళుతూ పలు రీల్ వీడియోలతో రచ్చ చేస్తున్నారు. ఈ వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీళ్ళ డాన్స్ వీడియోల కోసం నిత్యం వేలమంది నెటిజన్లు సోషల్ మీడియాను శోధిస్తుంటారు.

వీకెండ్ పార్టీల్లో చిల్
ఇక సురేఖావాణి- సుప్రితల వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పబ్ లకు వెళ్లడం, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తుండటం వీరి హ్యబీ. టైం దొరికితే చాలు గోవాకు వెళుతూ అక్కడ డ్రింక్ పార్టీలు చేసుకుంటూ చిల్ అవుతుంటారు. ఆయా వీడియోలు, ఫోటోలను తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి జనం నోళ్ళలో నానుతుంటారు.

డాబాపై బాల్కానీలో సుప్రిత
తాజాగా ఓ ఐదారంతస్థుల డాబా మీద తన ఎద అందాలు హైలైట్ అయ్యేలా ఓ వీడియో చేసింది సుప్రిత. బాల్కనీలో ఉన్న చిన్న గోడపై నిలబడి కాస్త రిస్క్ చేస్తూ ఈ వీడియో చేసింది. దీన్ని తన ఇన్స్‌స్టాలో పోస్ట్ చేయడంతో కొందరు నెటిజన్లు కొంటెగా కామెంట్స్ పెడుతుండగా.. ఇంకొందరు మాత్రం ఓయ్ కాలు జారుతావ్! వీడియో కోసం అంత రిస్క్ అవసరమా? అని కామెంట్లు వదులుతున్నారు.
సుప్రితతో లేచింది మహిళా లోకం
ఇన్నాళ్లు సినిమా అవకాశాల కోసం చూసిన సుప్రిత.. త్వరలోనే వెండితెరపై కూడా కనిపించబోతోంది. లేచింది మహిళా లోకం అనే సినిమాతో ఆమె సినీ గడప తొక్కబోతోంది. ఈ సినిమాలో మంచు లక్ష్మి లీడ్ రోల్ పోషిస్తుండగా.. హరితేజ, హేమ, శ్రద్దాదాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్- అర్జున్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











