అలాంటి పాత్రలు ఎందుకు చేయవు? నాపై అలాంటి రూమరు.. సురేఖ వాణి క్లారిటీ

అందం, అభినయం ఉన్న టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖవాణి ఒకరు. అప్పుడప్పుడు టాలీవుడ్‌లో మెరుస్తుంటారు. అయితే వెండితెరపై కంటే సోషల్ మీడియాలో ఫుల్ జోష్‌లో కనిపిస్తారు. తెలుగు చిత్రాల్లో అడపాదడపా దర్శనమిచ్చే కుర్ర హీరోయిన్ల అమ్మ తాజాగా స్వాతిముత్యం చిత్రంలో ఓ మంచి పాత్ర ద్వారా ఆకట్టుకొన్నారు. తాజాగా జరిగిన స్వాతిముత్యం సినిమా సక్సెస్ మీట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల వివరాలు, స్వాతిముత్యం సక్సెస్ మీట్ గురించి విశేషాల గురించి..

సురేఖ వాణి అమ్మ కాదు.. అక్కలా

సురేఖ వాణి అమ్మ కాదు.. అక్కలా

హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ఒక అప్‌కమింగ్ యాక్టర్‌కు ఆఫర్ ఇవ్వడం మీకు చాలా సాధారణమైన విషయం. కానీ మాకు అది గొప్ప అవకాశం. నాకు ఈ సినిమాలో ఆఫర్ ఇచ్చిన నాగవంశీ గారికి థ్యాంక్స్. ఈ సినిమా చూసి చిరునవ్వుతో బయటకు వస్తారని అనుకొన్నాం. కానీ గట్టిగా నవ్వుకుంటో ఆనందంతో బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. సురేఖవాణి గారు..నాకు తల్లిగా నటించారు. అయితే ఆమె నాకు తల్లిగా కాకుండా అక్కలా ఉన్నారని అన్నారని సురేఖవాణి చెప్పారు.

 వారికి రుణపడి ఉంటా

వారికి రుణపడి ఉంటా


స్వాతిముత్యం సినిమా సక్సెస్ మీట్‌లో సురేఖవాణి సంతోషంగా కనిపించారు. ఆమె మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత ఇలా నా డార్లింగ్స్‌ను చూడటం ఆనందంగా ఉంది. ఇలా అందర్ని కలుసుకోవడానికి కారణమైన దర్శకుడు, నిర్మాతకు, మా బ్యానర్‌కు రుణపడి ఉంటాను అని సురేఖవాణి ఎమోషనల్ అయ్యారు.

ఆఫర్లు మా వరకు రావడం లేదు..

ఆఫర్లు మా వరకు రావడం లేదు..


మీరు సినిమాల్లో కనిపించడం లేదు. సినిమాలకు దూరంగా ఉంటున్నారని అందరూ అడుగుతున్నారు. అలాంటి క్యారెక్టర్లు చేయండి.. ఇలాంటి క్యారెక్టర్లు చేయండి చెబుతున్నారు. అయితే ఏ క్యారెక్టర్‌నైనా చేయడానికి మా వరకు అవకాశాలు రావడం లేదు. ఈ సినిమా కథ, క్యారెక్టర్‌ను దర్శకుడు నాకు చెప్పినప్పుడు.. ఇది పాత్ర నా కోసమే అనుకొన్నావా అనే అనుమానాన్ని వ్యక్తం చేశాను. ఎందుకంటే.. కొన్ని క్యారెక్టర్లు మా వద్దకు రావడం లేదు. దానికి కారణమేమిటో ఏమిటో మాకు తెలియడం లేదు అని సురేఖవాణి చెప్పారు.

నా జీవితం సినిమా కోసమే

నా జీవితం సినిమా కోసమే


నేను సినిమాల్లో నటించడం మానేశారని అనడం తప్పు. నా జీవితం సినిమా కోసమే. నేను సినిమాల్లో నటించడానికే ఉన్నాను. సినిమా కోసమే ఉంటాను. సినిమాలు చేస్తూనే ఉంటాను. స్వాతిముత్యం సినిమాలో నాకు మంచి అవకాశం ఉచ్చిన దర్శకుడు లక్ష్మణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. సినిమా హిట్ కావాలని లక్ష్మణ్ కోసం ప్రార్థించాం. ఇంకా చాలా మంచి సినిమాలు చేసి మాకు మంచి పాత్రలు ఇవ్వాలి అని సురేఖవాణి అన్నారు.

చిరంజీవి ఆశీస్సులతో

చిరంజీవి ఆశీస్సులతో


నూతన దర్శకుడు లక్ష్మణ్, హీరో గణేష్, వర్ష బొల్లమ్మ నటించిన స్వాతిముత్యం మంచి టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో నిర్వహించిన స్వాతిముత్యం సినిమా సక్సెస్ మీట్‌లో నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. స్వాతి ముత్యం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. మా సినిమాకి లభిస్తున్న ఆదరణ పట్ల సంతోషంగా ఉంది. చిత్ర విడుదలకు ముందు చిరంజీవి గారు పెద్ద మనసుతో మా సినిమాకి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు స్వాతి ముత్యం, గాడ్ ఫాదర్ రెండు చిత్రాలూ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. స్వాతి ముత్యం చిత్రానికి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఈ వారాంతానికి వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X