నా పెళ్లి అయ్యేలోపు మా అమ్మకు మరో పెళ్లి చేస్తా.. యంగ్ హీరోయిన్ కోరిక..
ప్రముఖ నటి సురేఖ వాణి (Surekha Vani), ఆమె కూతురు బండారు సుప్రిత నాయుడు (Bandaru Supritha Naidu) తెలుగు ప్రేక్షకులకు తెలుసు. సుప్రీత ఇప్పటికే టీవీ షోస్, సోషల్ మీడియాతో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. సుప్రీత ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. అమరావతికి ఆహ్వానం అనే సినిమాతో ఫిబ్రవరి 13న రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సుప్రీత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తల్లి పెళ్లి గురించి మాట్లాడింది. సుప్రీత తండ్రి కొన్నేళ్ల క్రితమే మరణించారు. దీంతో సురేఖ పెళ్లిపై గతంలో వార్తలు వచ్చాయి. పెళ్లి వార్తలపై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే.. ?
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సుప్రీత తన పర్సనల్ లైఫ్‌తో పాటు తల్లి గురించి భావోద్వేగంగా మాట్లాడింది. సుప్రీత తండ్రి కొన్నేళ్ల క్రితమే మరణించడంతో... సురేఖ వాణి రెండో పెళ్లి గురించి గతంలో పలు వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన సుప్రీత .. 'నిజానికి మా అమ్మకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. డాడీ చనిపోయాక ఆమె జీవితాన్ని ఇంకెవరితోనూ పంచుకోవాలనుకోవడం లేదు. కానీ నేను మాత్రం... నేను పెళ్లి చేసుకునే ముందు మా మమ్మీకి మరో పెళ్లి చేయాలన్న కోరిక ఉంది. ఈ విషయం మా మామయ్యలకు కూడా చెప్పాను. వాళ్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే అమ్మకూ ఆ ఆలోచన రావాలి, సరైన వ్యక్తి దొరకాలి. అన్ని కుదిరితేనే పెళ్లి' అంటూ క్లారిటీ ఇచ్చింది.

"మమ్మీ పెళ్లి చేసుకుంటే మీపై ప్రేమ తగ్గిపోతుందేమో?" అన్న ప్రశ్నకు 'అలాంటి భయం అస్సలు లేదు. మా మమ్మీకి నేనంటే ప్రాణం. నా స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు'అంటూ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. ఇక తన కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడుతూ...
'నన్ను అర్థం చేసుకుంటే చాలు, నా చేష్టలు భరిస్తే చాలు, నేను వండినది తింటే చాలు. అంతకుమించి ఏమీ కోరుకోవడం లేదు," అని నవ్వుతూ చెప్పింది.
అలాగే అమ్మకు కాబోయే వ్యక్తి ఎలా ఉండాలంటే... 'మమ్మీని చాలా బాగా చూసుకోవాలి. కాలు కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె ఏం కోరుకున్నా కాదనకుండా ఇవ్వాలి. ఆమె చేసే ప్రతి విషయాన్ని ప్రశ్నించకుండా స్వేచ్ఛగా ఉండనివ్వాలి' అంటూ స్పష్టంగా చెప్పింది.
సురేఖ వాణి సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయంపై కూడా స్పందించిన సుప్రీత... 'ఒకప్పుడు మా అమ్మ చాలా బిజీ ఆర్టిస్ట్. కానీ ఏడాదిన్నరగా మేకప్ కూడా వేసుకోలేదని ఫీల్ అవుతుంది. చాలా మంది సీనియర్ ఆర్టిస్టులకు ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి. అమ్మకూ సినిమాలు చేయాలనే కోరిక ఉంది... ఏదైనా ఒక్క సినిమా అయినా చేయాలని అనిపిస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది.
డ్రెస్సింగ్ సెన్స్‌పై వచ్చిన ప్రశ్నకు స్పందిస్తూ 'ఎక్కడ ఎలా ఉండాలో తెలిసి ఉండాలి. గోవాలో షార్ట్ టీషర్ట్ వేసుకుంటా... కానీ ఇక్కడ జనాల్లోకి అలా రావడం బాగోదు. పెళ్లికి షార్ట్ టీషర్ట్ వేసుకుని వెళ్లం కదా. అమ్మాయిలే కాదు అబ్బాయిల గురించి కూడా ఇప్పుడు సమాజంలో చాలా వరస్ట్‌గా మాట్లాడుతున్నారు," అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది.


Click it and Unblock the Notifications











