అలాంటి లింక్ పెట్టి దారుణం... నా మీదపడి బతుకుతున్నారు... సురేఖవాణి కంటతడి
అమ్మ, అక్క, అత్త, వదిన పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్టార్ ఇమేజ్‌ను సాధించారు సురేఖ వాణి. ఒకప్పుడు క్షణం తీరిక లేకుండా గడిపిన ఆమె.. ఆ తర్వాత సినిమాలను నెమ్మదిగా తగ్గించేశారు. తన కుమార్తె సుప్రీతతో కలిసి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. 50కి దగ్గర అవుతున్నప్పటికీ చెక్కు చెదరని గ్లామర్‌తో సందడి చేస్తున్నారు సురేఖవాణి. ఈ విషయంలో తమపై ఎన్ని విమర్శలు వచ్చినా సురేఖ ఏమాత్రం పట్టించుకోదు. కొన్నిసార్లు సుప్రీత, సురేఖలను నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా జర్నలిస్ట్ ప్రేమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమపై జరుగుతున్న ట్రోలింగ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి దిగిన ఫోటో విషయంలో జరిగిన వివాదంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఎంతమందికి నోరు మూయించను
19 ఏళ్లకే నాకు పెళ్లయ్యింది.. 20, 25 ఏళ్ల వయసులో 40 ఏళ్ల బిహేవియర్ చూసేశాను. 40 ప్లస్‌లో 20 ఏళ్ల అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నా. నేను నా కూతురితో ఎంజాయ్ చేస్తున్నాను.. నా మొగుడు ఉన్నా కూడా ఇదే జరిగి ఉండేదేమో. నేను, నా కూతురు ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా సోషల్ మీడియా జనాలు గమనించేవారు. అవన్నీ చూసి తొలిరోజుల్లో భయపడ్డాం. కానీ ఇప్పుడు అలవాటైపోయింది. నా బ్రదర్స్, నా కజిన్స్, నా ఇంట్లోవాళ్లు ఇలా రాశారు.. ఇలా కామెంట్ పెట్టారని నాకు చెప్పేవారు. నేను వాటిని చూడటం మానేయమని చెప్పాను. వాటికి ఓవర్ రియాక్ట్ అవ్వకపోతే ఏ ప్రాబ్లమ్ లేదు.. ఎంతమంది నోళ్లు మూయించగలం. 100 మందిలో 10 మంది మన గురించి మాట్లాడతారు కదా అని సురేఖ వాణి చెప్పారు.

ఆ దర్శకుడితో ఫోటో దిగినందుకు
హీరోలతో ఫోటోలు దిగినప్పుడు కూడా దారుణంగా కామెంట్స్ పెట్టేవారు. వాటిని నేను ఏమాత్రం పట్టించుకోను. పచ్చిగా చెప్పాలంటే పిచ్చినా కొడుకులు మాట్లాడుకుంటున్నారు అనుకుంటా. గతంలో ఆర్జీవీ గారితో ఓ సినిమా చేశా.. ఏదో బర్త్ డే పార్టీలో ఆయన కలవడంతో ఫోటో దిగాను. సినిమా చేసినప్పుడు ఆయనతో ఫోటో తీసుకోలేకపోయా. అందుకే గుర్తుగా దాచుకున్నా. దానికి ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఒకడు కూర్చొని ఆర్జీవీ ఎంతోమందిని చూశాడు.. ఇప్పుడు సురేఖవాణి వైపు ఎందుకు తిరిగాడో అని వీడియో చేశాడు. అది చూసి షాక్ అయ్యా.. అసలు ఆర్జీవీ ఎవరు? మళ్లీ వెళ్లి నేను పలకరిస్తే కనీసం గుర్తుంటానో లేదో కూడా తెలియదు. దాని గురించి ఒక ఎపిసోడ్ చేశారని సురేఖ వాణి సీరియస్ అయ్యారు.
నా మీదపడి సంపాదిస్తున్నారు
అప్పుడు చూసినప్పుడు ఇంత ఖాళీగా ఉన్నారా రా మీరు అనుకున్నా. నా మీద పడి డబ్బులు సంపాదించుకుంటున్నారు.. పర్లేదు నేను నలుగురికి భోజనం పెడుతున్నాను అనుకున్నా. సింగిల్ పేరెంట్, సింగిల్ మదర్ ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. భర్త, అమ్మానాన్నలు ఉన్నప్పుడు ఆడదానిని ట్రీట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. మొగుడు వదిలేశాడో? మొగుడు పోయిన రోజున ఆడదానిని ట్రీట్ చేసే విధానం వేరుగా ఉంటుందని సురేఖ వాణి పేర్కొన్నారు.
అకౌంట్ డియాక్టివేట్ చేసింది
సోషల్ మీడియాలో మా గురించి వచ్చే కామెంట్స్‌కి తను హర్ట్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకసారి అకౌంట్ కూడా డియాక్టివేట్ చేసింది. నువ్వు సురేఖవాణి డాటర్... సెలబ్రిటీవి అయిపోయావు ఇవన్నీ పట్టించుకోవద్దని చెప్పా. బాధపడే స్టేజ్ నుంచి నవ్వుకునే స్టేజ్‌కు వచ్చేశాం. చిన్న వయసులోనే నేను సినిమాల్లోకి వచ్చేశా. టీవీ, టీవీ నుంచి సినిమాల్లోకి వచ్చేశా. నా కూతురు ఎంత వరకు ఇందులో నెగ్గుకురాగలదు... ఫెయిల్యూర్‌ను యాక్సెప్ట్ చేయగలగాలి. సక్సెస్ వస్తుందా? రాదా? అని పక్కనపెడితే ఫెయిల్యూర్‌ను యాక్సెప్ట్ చేస్తుందా? లేదా? అని భయపడ్డానని సురేఖ వాణి చెప్పారు
క్యాస్టింగ్ కౌచ్‌పై కామెంట్స్
అందుకే తనని సినిమాల్లోకి తీసుకురావాలా? లేదా? అని ఎంతో టెన్షన్ పడ్డా. నేను ఏ రోజు సినిమా వాళ్ల దగ్గరి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయలేదు. కాస్టింగ్ కౌచ్‌లు కూడా నాకు తెలియదు. ఎందుకంటే సినిమాల్లోకి నేను కష్టపడి రాలేదు. మా ఆయన డైరెక్టర్.. టీవీలో సక్సెస్, సినిమా వాళ్లు నన్ను అడిగి తెచ్చుకున్నారు. నన్ను చాలా బాగా చూసుకున్నారు.. మిగిలిన విషయాలు తెలియదు. నా చేతుల మీదుగానే సుప్రీతను అనౌన్స్ చేయాలని నా భర్త అనుకున్నాడు. ఒక సంక్రాంతికి చిన్న సాంగ్ కూడా స్టార్ట్ చేశారు.. ఒకవేళ బతికుంటే షార్ట్ ఫిల్మ్ ఏదైనా చేసేవారని సురేఖ వాణి తన భర్తను గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











