రెండో బిడ్డను అందుకే కనలేదు.. సుప్రిత తర్వాత సంతానంపై సురేఖవాణి
తెలుగు సినిమా రంగంలో గ్లామర్‌తో కూడిన క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకొన్న యాక్టర్లలో సురేఖ వాణి ఒకరు. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకొనే ఈ నటి వెండితెర మీద కంటే.. సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఇటీవల కాలంలో హంగామా చేస్తూ కనిపిస్తుంటారు. అయితే ఒకరి గురించి ఆలోచించకుండా తనకు నచ్చినట్టుగా బోల్డ్ లుక్‌తో ఫోటోలు, వీడియోలు పెడుతూ హల్‌చల్ చేస్తుంటారు. అయితే తాజాగా తన కూతురు సుప్రితతో కలిసి ఆమె నిఖిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ రెండో సంతానం గురించి ఫన్నీగా జవాబు చెప్పారు. ఆమె వ్యక్తిగత జీవితం.. ఆమె చెప్పిన వివరాల్లోకి వెళితే..
టెలివిజన్ యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సురేఖ వాణి బుల్లితెర మీద తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. మాటీవీ, ఇతర ఛానెల్స్‌లో వర్క్ చేస్తున్న సమయంలో టెలివిజన్ డైరెక్టర్ సురేష్ తేజతో ప్రేమలో పడింది. ఆ తర్వాత తన భర్త డైరెక్షన్‌లోనే మా టాకీస్, హర్ట్ బీట్, మొగుడ్ పెళ్లామ్స్ లాంటి షోలను సమర్ధవంతంగా నడిపించింది. ఆ తర్వాత తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

తెలుగు సినిమా రంగంలో భద్ర సినిమాతో గుర్తింపు తెచ్చుకొన్న సురేఖ వాణి ఆ తర్వాత బొమ్మిరిల్లు మూవీతో పాపులర్ అయిపోయారు. దుబాయ్ శ్రీను, ప్రస్థానం, శ్రీమంతుడు, పిల్లా నీవు లేని జీవితం తదితర చిత్రాల్లో నటించారు. అయితే ఎక్కువ కాకుండా తనకు నచ్చే పాత్రలతోనే ఆమె సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుంటారు. అప్పుడప్పుడు కనిపించినా.. మంచి పాత్రలతోనే ఆలరిస్తుంటారు.
ఇక నటిగా, యాంకర్‌గా రాణిస్తున్న సురేఖ వాణి జీవితం భర్త మరణంతో కుదుపుకు లోనైంది. తన భర్త మృతి విషాదం నుంచి తేరుకొని.. తన కూతురు కెరీర్ గురించి జాగ్రత్తలు తీసుకొంటుంది. కుమార్తెతో కలిసి వెకేషన్స్, పార్టీలు, పబ్ ఈవెంట్స్‌తో చిల్ అవుతూ కనిపిస్తుంటారు. కొన్నిసార్లు ఆమె పెట్టే పోస్టులపై నెటిజన్లు ఘాటుగానే కామెంట్స్ చేసిన పెద్దగా పట్టించుకోకుండా తన జీవితాన్ని పూర్తి ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తారు.
అయితే యాంకర్ నిఖిల్‌కు సుప్రిత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన కూతురు చాలా సార్లు తమ్ముడో, చెల్లే ఉంటే బాగుండేది అని అడుగుతుంటుంది. కానీ నేను ఏదో చెప్పి దాటే వేసేదానిని అని అసలు విషయం చెప్పకుండా తప్పించుకొనే ప్రయత్నం చేసింది. దాంతో నీవు ఎప్పుడూ అడగలేదా? అని సుప్రితను అడిగితే.. నాకు మాత్రం ఒక విషయం చెప్పేది. నీకు తమ్ముడో, చెల్లెలు ఉంటే.. ఏదైనా ఇవ్వాలంటే.. దానిలో సంగం వారికి కూడా ఇవ్వాల్సి వచ్చేది. నీవు ఒక్కరే కాబట్టి.. ఏం ఇవ్వాలన్నా నీకే ఇస్తాను. పూర్తిగా నువ్వే తీసుకోవచ్చు కదా అని మమ్మి చెప్పేది అని సుప్రిత సమాధానం ఇచ్చింది.
అయితే రెండో బిడ్డను కనాలని ఉండేది. కానీ వర్క్, ప్రొఫెషనల్ పనుల కారణంగా ప్లానింగ్ చేసుకోలేకపోయాం. కానీ రెండో బిడ్డ లేని లోటును సుప్రిత ఎన్నడూ రానివ్వలేదు అనే విధంగా సురేఖ వాణి తన ప్రేమను వ్యక్త పరిచే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











