Suriya Jyothika: సూర్యతో కలిసి ఆ వీడియో షేర్ చేసిన జ్యోతిక.. డబుల్ ఫన్ అంటూ!
హీరో సూర్య, హీరోయిన్ జ్యోతిక జోడి గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి వీరిద్దరూ కలిసి గతంలో సినిమాలు చేసేవారు. తర్వాత ప్రేమలో పడి వివాహం కూడా చేసుకున్నారు. ఎక్కువగా తమిళ సినిమాలు చేసినా సూర్య చేసిన సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అవడం వలన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయిపోయారు. తాజాగా ఈ జంట షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వివరాలు లోకి వెళితే.
నిజానికి జ్యోతిక తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశారు. కానీ ఇక్కడ కంటే ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేశారు. ఎన్నో హిట్ సినిమాలలో భాగమైన ఆమె కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే తన తోటి హీరో అయిన సూర్యను ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇక వీరి ప్రేమ వివాహం తర్వాత జ్యోతిక సినీ పరిశ్రమకు దూరమైంది.

పిల్లలని కనడంతో వారికోసం సమయం వెచ్చించడం కోసం ఆమె చాలా కాలం పాటు తిరిగి పరిశ్రమకు దూరంగానే ఉండిపోయింది. ఇక ఆ తర్వాత పిల్లలకు తన అవసరం లేదు. వాళ్లు బాగానే ఉంటున్నారు అని అర్థమైన తర్వాత ఆమె రీఎంట్రీ ఇచ్చి ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తోంది.
సినిమా అవకాశాలు వచ్చి పడుతున్నా వెంట వెంటనే ఒప్పుకోకుండా అడపా గడపా సినిమాలు ఒప్పుకుంటూ మాత్రమే ఆమె సినిమాలు చేస్తూ వెళ్తోంది. సూర్య కూడా వరుస సినిమాలో ఒప్పుకోకుండా బాగా నచ్చిన సినిమాలను మాత్రమే ఒప్పుకుంటూ ముందుకు దూసుకువెళుతున్నారు. చేసింది కొన్ని సినిమాలైనా విలక్షణమైనవిగా ఉండాలని భావిస్తున్న సూర్య అందుకు తగ్గట్టుగానే స్క్రిప్ట్ సెలక్ట్ చేసుకుంటున్నారు.
ఆయన ప్రస్తుతం కంగువ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా జ్యోతిక ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో సూర్యతో పాటు ఆమె జిమ్ వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తోంది. దానికి ఆమె ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా పెట్టింది. ఇద్దరం కలిసి కష్టపడితే ఇద్దరికీ ఫన్ మిగులుతుంది అని అర్థం వచ్చేలా ఆమె కామెంట్ చేసింది. ఇక ఇద్దరు కూడా ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పొచ్చు.
సుమారు 40 ఏళ్ల పైబడి వయసు ఉన్నా సరే వాళ్ళు అలా కనిపించకుండా ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. సినిమాలో పాత్రల కోసం మాత్రమే కాకుండా తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం కోసం వీరిద్దరూ డైలీ జిమ్ చేస్తారని చెబుతున్నారు. ఇక జ్యోతిక విషయానికి వస్తే ఆమె ఒకపక్క సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోలో సూర్య ఫిట్నెస్ తో పాటు జ్యోతిక ఫిట్నెస్ చూసిన అభిమానులందరూ షాక్ అవుతున్నారు.
ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ఎవరికి వారు వెనక్కి తగ్గకుండా ఒకరితో ఒకరు పోటీ పడుతూ తమ ఫిట్నెస్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











