‘ఆ డైరెక్టర్ పడుకోమన్నాడు..పెళ్లయినా వెంటాడుతూ, నా కొలతలపైనే కన్ను’
చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే ఆడపిల్లల్ని ట్రాప్ చేసి వారితో లైంగిక కోర్కెలు తీర్చుకునే వ్యవహారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా ఉన్న నటీమణులు సైతం తాము ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ బారినపడిన వారిమేనని పలు సందర్భాల్లో వెల్లడించారు. చిత్రసీమలో లైంగిక వేధింపుల గురించి రోజుకొక హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా. ఆమె చేసిన ఆరోపణల వివరాల్లోకి వెళితే..
బుల్లితెర టూ వెండితెర
చండీగఢ్‌కు చెందిన సుర్వీన్ చావ్లా తొలుత బుల్లితెరలో అడుగుపెట్టారు. కెహ్లిన్ తో హోగా, కాజల్, కసౌటీ జిందగీ హై తదితర సీరియల్స్ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఈ ఫేమ్‌తో 2008లో పరమేశ పన్వాలా అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన రాజు మహారాజు సినిమాతో తెలుగువారిని పలకరించారు. అందం, అభినయం ఉన్నప్పటికీ ఎందుకో సుర్వీన్ చావ్లాకు అవకాశాలు దక్కలేదు. దీంతో బాలీవుడ్‌పైనే ఆమె ఫోకస్ పెట్టారు. హిందీతో పాటు తన మాతృభాష పంజాబీలో నటిస్తున్నారు. పంజాబీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నిలిచారు.

ఓటీటీలలో బిజీగా సుర్వీన్ చావ్లా
సినీ పరిశ్రమలోనూ అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై తిరిగి అడుగుపెట్టి దూసుకెళ్తున్నారు. ఇక ఓటీటీలు రంగప్రవేశం చేయడంతో సుర్వీన్ చావ్లా బిజీ అయ్యారు. రానా, దగ్గుబాటి వెంకటేష్‌ల రానా నాయుడు సీజన్ 1లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సీజన్ 2లోనూ సందడి చేయనుంది. ప్రస్తుతం క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 వెబ్ సిరీస్‌తో అలరించారు సుర్వీన్. తాజాగా ది మేల్ ఫెమినిస్ట్ అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సుర్వీన్ చావ్లా.. చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు, తెర వెనుక బాగోతాలను పంచుకున్నారు.
నన్ను ముద్దు పెట్టుకోబోయాడు
కెరీర్ తొలినాళ్లలో ముంబైలోని వీరా దేశాయ్ మార్గ్‌లోని ఓ దర్శకుడి కార్యాలయానికి తనను పిలిచారని సుర్వీన్ చెప్పింది. మాటల సందర్భంలో నీ వైవాహిక జీవితం ఎలా ఉంది? మీ భర్త ఏం చేస్తారు? వంటి పర్సనల్ విషయాలు అడిగారని ఆ సమయంలో నేను, ఓ వ్యక్తి ఇద్దరమే ఉన్నామని ఆమె తెలిపారు. మీటింగ్ పూర్తయి తాను వెళ్తుండగా ఆయన నా వైపు జరిగి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని సుర్వీన్ చెప్పారు. ఊహించని ఈ పరిణామంతో భయపడ్డ తాను వెంటనే అతనిని వెనక్కి నెట్టి వచ్చేశానని, అయినప్పటికీ అతను గేటు వరకు తనను అనుసరించాడని తెలిపారు.
ఆ దర్శకుడు పడుకుంటావా అని అడిగాడు
మరో ఘటనలో ఓ జాతీయ అవార్డ్ పొందిన దక్షిణాది దర్శకుడు తనతో పడుకోవాలని కోరిక చెప్పాడని, ఈ విషయాన్ని తన ఫ్రెండ్ ద్వారా తనకు వర్తమానం పంపాడని సుర్వీన్ పేర్కొన్నారు. అలాగే దక్షిణాదిలో బాడీ షేమింగ్ సంఘటనలు కూడా ఎదురయ్యాయని ఆమె వెల్లడించారు. ఇప్పుడే కాదు గతంలో పలు ఇంటర్వ్యూల సమయంలోనూ సుర్వీన్ చావ్లా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీలో మహిళలను తక్కువగా చూస్తారని.. దక్షిణాది పరిశ్రమలో హీరోయిన్ల బరువు, నడుము సైజు, ఛాతీ సైజు ఇలా ప్రతీ దానిని తెలుసుకోవాలని అనుకుంటారని సుర్వీన్ చావ్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సుర్వీన్‌తో అసభ్యంగా ప్రవర్తించిన దక్షిణాది దర్శకుడు ఎవరనేది మాత్రం తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











