For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా తొడలు, క్లీవేజ్‌పైనే ఆ దర్శకుల కన్ను... సౌత్ ఇండస్ట్రీలో దర్శకుల వెకిలి చేష్టలు.. యువ నటి తీవ్ర ఆరోపణలు

  |

  ప్రముఖ నటి నీనా గుప్తా తన ఆటోబయోగ్రఫి సచ్ కహాతో: మేరీ ఆత్మకథ పుస్తకంలో దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖుల క్యాస్టింగ్ కౌచ్‌ (పడకగదిలోకి వస్తే ఆఫర్) గురించి బట్టబయలు చేసిన తర్వాత మరో యువ హీరోయిన్ సుర్వీన్ చావ్లా పెదవి విప్పారు. దక్షిణాదిలో తనకు జరిగిన చేదు అనుభవాలను విడమర్చి చెప్పేందుకు ప్రయత్నించారు. దక్షిణాది ప్రముఖ దర్శకుడు, నిర్మాత గురించి సర్వీన్ చావ్లా చెప్పిన విషయాలు ఏమిటంటే...

   సుర్వీన్ చావ్లా కెరీర్ విషయానికి వస్తే..

  సుర్వీన్ చావ్లా కెరీర్ విషయానికి వస్తే..

  సుర్వీన్ చావ్లా కెరీర్ విషయానికి వస్తే.. దాదాపు 30 చిత్రాల్లో నటించింది. పరమేశా పాన్‌వాలా అనే కన్నడ చిత్రంతో 2008లో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత రాజు మహారాజు అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హమ్ తుమ్ షాబానా, అగ్లీ, హిమ్మత్‌వాలా, హేట్ స్టోరీ 2, జై హింద్ 2, పార్చడ్, ఛురీ చిత్రాల్లో నటించింది. మూండ్రు పెర్ మూండ్రు కాదల్, పుథియా థిరుప్పంగల్ లాంటి తమిళ చిత్రాల్లో నటించింది.

  మూడుసార్లు చేదు అనుభవాలు

  మూడుసార్లు చేదు అనుభవాలు

  సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నించిన సమయంలో ఎక్కువగా నాకు దక్షిణాది చిత్ర పరిశ్రమలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మూడు సార్లు నాకు నిర్మాతల నుంచి సమస్యలు ఎదురయ్యాయి. వారితో పడుకొంటేనే సినిమా ఆఫర్లు ఇస్తామని చెప్పారు. దాంతో ఆ సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది అని సుర్వీన్ చావ్లా తెలిపారు.

  నీ శరీరంలో ప్రతీ అంగుళం...

  నీ శరీరంలో ప్రతీ అంగుళం...

  దక్షిణాదిలో ఓ నిర్మాత నాకు అవకాశం ఇస్తానని చెప్పి.. షూటింగు లొకేషన్ల ఎంపిక కోసం జరిగే రెక్కీ కోసం రమ్మని పిలిచాడు. నిర్మాత నాత మాట్లాడుతూ... నీ శరీరంలోని ప్రతీ అంగుళం గురించి నాకు తెలియాలి అని చెప్పాడు. నిర్మాత ఆ మాట చెప్పగానే నేను అతడి ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం మానేశాను అని సుర్వీన్ చావ్లా చెప్పారు.

  జాతీయ అవార్డు పొందిన దర్శకుడు అలా

  జాతీయ అవార్డు పొందిన దర్శకుడు అలా

  ఇక మరో దర్శకుడు నాతో దారుణంగా ప్రవర్తించాడు అంటూ సుర్వీన్ చావ్లా మరో బాంబు పేల్చింది. ఆయనకు ఆ సమయంలో జాతీయ అవార్డు వచ్చింది. అతడు నాతో చాలా సుదీర్గంగా ఆడిషన్ చేయించాడు. నాతో రకరకాల విన్యాసాలు చేయించారు. పలు విధాలుగా నన్ను చెక్ చేశారు. ఆడిషన్స్ దెబ్బకు నా ఆరోగ్యం పాడైపోయింది. అలాంటి విసుగుల మధ్య ఆ డైరెక్టర్‌కు థాంక్స్ చెప్పి.. ఆ సినిమాను వదులుకొన్నాను అని సుర్వీన్ చావ్లా తెలిపారు.

  తమిళ ఇండస్ట్రీలో దారుణంగా

  తమిళ ఇండస్ట్రీలో దారుణంగా

  తమిళ ఇండస్ట్రీలో ఓ దర్శకుడు చాలా విసిగించాడని సుర్వీన్ వెల్లడించింది. అతడు నాతో తమిళంలోనే మాట్లాడే వాడు. ఇంగ్లీష్, హిందీలో మాట్లాడటానికి నిరాకరించే వాడు. కొన్నిసార్లు అతడి స్నేహితుడి ద్వారా మాట్లాడించేవాడు. ఒకసారి దర్శకుడు స్నేహితుడు మాట్లాడుతూ... సినిమా ప్రారంభం కావడానికి కొంత సమయం పడుతుంది. ఆ లోపు నీ గురించి సార్ తెలుసుకోవాలని అనుకొంటున్నాడు. అప్పటి వరకు నీవు అతడితో ఆపకూడదు. సినిమా మొదలైన తర్వాత ఆ పని ఆపేయవచ్చు అని అన్నాడు. దాంతో ఆపేయడం ఏమిటని ప్రశ్నించడంతో అతడు నీళ్లు నమిలాడు. మీరు నన్ను తప్పుగా ఊహించుకొంటున్నారు. నేను చాలా టాలెంటెడ్‌ యాక్టర్‌ను. ఆఫర్ కోసం నీచమైన పనులు చేయను అంటూ ఆ సినిమాను వదులుకొన్నాను. ఆ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది అంటూ సుర్వీన్ చావ్లా వెల్లడించారు.

  బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ వెకిలి చేష్టలు

  బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ వెకిలి చేష్టలు

  ఇక హిందీ సినీ పరిశ్రమలో తాజా కొద్ది రోజుల క్రితం అలాంటి సంఘటనలే జరిగాయి. గతేడాది చివర్లో ఓ దర్శకుడు దారుణంగా ప్రవర్తించారు. నా కోరిక తీర్చమంటూ పరోక్షంగా హింట్స్ ఇస్తూ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. దాంతో బలవంతంగా వారి నుంచి విడిపించుకొని బయటపడ్డాను. ఇక మరో నిర్మాత నా క్లివేజ్ చూడాలని అడిగాడు. మరోకరు నా తొడలను చూపించమని బలవంతం చేశాడు. ఇలాంటి విషయాలతో చాలా విసిగిపోయాను అంటూ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుర్వీన్ చావ్లా వెల్లడించారు.

  English summary
  Surveen Chawla serious allegations on South Producers and directors. Surveen Chawla speak to bollywood media and said that, film makers look for my Cleavage and thighs.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X