సుశాంత్ మొబైల్ డేటా ఏది? సీఎం కుర్చీ కోసం నీ తండ్రి డర్టీ పాలిటిక్స్.. ఆదిత్య థాక్రేపై కంగన ఫైర్

మహారాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కుమారుడు ఆదిత్యా థాక్రేపై బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ భగ్గుమన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో తనను ఇరికించేందుకు డర్టీ పాలిటిక్స్ చేయవద్దంటూ చేసిన వ్యాఖ్యలపై కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిత్య వాఖ్యలపై కంగన స్పందిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె చేసిన ట్వీట్లు వైరల్‌గా మారాయి.

డర్టీ పాలిటిక్స్ అంటూ కంగన టీమ్ ఫైర్

డర్టీ పాలిటిక్స్ అంటూ కంగన టీమ్ ఫైర్

దిశా సలియాన్, సుశాంత్ మరణం కేసుతో సంబంధముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రముఖులతో ఆదిత్య థాక్రేకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కేసు విచారణను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే ఆరోపణలు, విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ మరణంతో ప్రతిపక్ష పార్టీలు డర్టీ పాలిటిక్స్ చేస్తున్నాయని ఆదిత్య థాక్రే ఓ ప్రకటనలో అన్నారు.

నీ తండ్రి సీఎం కుర్చీ ఎలా సంపాదించారో తెలుసా?

నీ తండ్రి సీఎం కుర్చీ ఎలా సంపాదించారో తెలుసా?

ఆదిత్య థాక్రే చేసిన వ్యాఖ్యలపై కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. నీ తండ్రి ఎలా సీఎం కుర్చీ సంపాదించారో ఓసారి తిరిగి చూసుకో అంటూ కంగన టీమ్ సెటైర్లు వేశారు. మీ నాన్న సీఎం కావడానికి చేసిన డర్టీ పాలిటిక్స్ కేసు స్టడీగా ఉపయోగించుకోవచ్చు. డర్టీ పాలిటిక్స్ గురించి మాటలు చెప్పడం ఆపి సుశాంత్ సింగ్ మరణం కేసులో లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పమన అంటూ ట్వీట్ చేశారు.

ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయడం లేదు

ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయడం లేదు

సుశాంత్ సింగ్ కేసులో అనుమానాస్పదంగా మారిన రియా చక్రవర్తి ఎక్కడుందో చెప్పాలి?, సుశాంత్ సింగ్ అసహజ మరణంగా భావించి ఎఫ్ఐఆర్‌ను ముంబై పోలీసులు ఎందుకు నమోదు చేయడం లేదు? సుశాంత్ మరణించిన తర్వాత మొదటి రోజు నుంచే సూసైడ్ అని ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని కంగన రనౌత్ టీమ్ ప్రశ్నల వర్షం కురిపించింది.

సుశాంత్ మొబైల్ డేటా ఎందుకు పరిశీలించడం లేదు

సుశాంత్ మొబైల్ డేటా ఎందుకు పరిశీలించడం లేదు

అంతేకాకుండా సుశాంత్ మరణంపై ఫొరెన్సిక్ నిపుణుల అభిప్రాయలు తీసుకోవడం లేదు? సుశాంత్ మొబైల్ ఫోన్ డేటాను ఎందుకు పరిశీలించడం లేదు? ఆయన మర్డర్ జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతుంటే దర్యాప్తును ఆ దిశగా ఎందుకు చేయడం లేదు. సీబీఐ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించడం లేదు అనే ప్రశ్నలను కంగన టీమ్ వేశారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
అధికారిని ఎందుకు క్వారంటైన్‌లో పెట్టారు

అధికారిని ఎందుకు క్వారంటైన్‌లో పెట్టారు

సుశాంత్ సింగ్ మరణం కేసును దర్యాప్తు చేయడానికి వచ్చిన బీహార్ అధికారిని క్వారంటైన్ పేరుతో ఎందుకు లాకప్‌లో పెట్టారు? రియా, ఆమె కుటుంబ సభ్యులు లూటీ చేసిన డబ్బు గురించి ఎందుకు దర్యాప్తు తీయడం లేదు? ఇలాంటి ప్రశ్నలు ప్రజల మనస్సుల్లో రేకెతుంటే మీరు నిమ్మకు నీరెత్తుతున్నట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటూ కంగన టీమ్ ట్వీట్లు చేస్తూ భగ్గుమన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X