నన్ను ఎవరూ కొనలేరు.. నేను అమ్ముడుపోను.. సుశాంత్ ప్రాణం తీసుకోడు.. అంకిత షాకింగ్ ట్వీట్
దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే సంచలనాత్మకమైన విధంగా కామెంట్లు, ట్వీట్లు చేస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నారు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత చాలా రోజులు మౌనం దాల్చిన అంకిత ఇటీవల పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన విషయాలు బయటపెట్టారు. ఆమె ఇటీవల నర్మగర్భంగా చేసిన ట్వీట్ వైరల్ అవుతున్నది. ఇంతకు అంకిత లోఖండే ఏం చెప్పారంటే..

సుశాంత్‌తో బ్రేకప్ తర్వాత కూడా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో అంకిత లోఖండే పరిచయం పవిత్ర రిస్తా సీరియల్ షూటింగ్ సమయంలో జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ ఆరేళ్లపాటు డేటింగ్ చేశారు. అనంతరం వ్యక్తిగత అభిప్రాయ విభేదాల తలెత్తడంతో విడిపోయారు. సుశాంత్‌తో బ్రేకప్ జరిగిన తర్వాత కూడా ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు.

అప్పుడే సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేసి ఉంటే
సుశాంత్‌తో విడిపోయిన తర్వాత ఆయన తండ్రి, అక్కా, చెల్లెల్లతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాను. సుశాంత్ సింగ్ మరణానికి ముందే ఆయన తండ్రి ఫిర్యాదు చేసి ఉంటే బ్యాంకు ఖాతాలో అవకతవకలు అప్పుడే బయటపడేవి. సుశాంత్ కుటుంబం నాకు ముఖ్యం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను అని అంకిత లోఖండే తెలిపారు.

కెరీర్ కోసం ప్రాణం తీసుకొనే వాడు కాదు..
సుశాంత్ గురించి నాకు బాగా తెలుసు. సినీ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఆయనకు ముందే గ్రహించారు. అయితే ఇలాంటి ఒత్తిడికి సుశాంత్ తలవొగ్గే వ్యక్తి కాదు. కెరీర్ కోసం ప్రాణాలు తీసుకొనేంత బలహీనుడు కాదు. ఆయన మరణం వెనుక కారణాలు వేరే ఉన్నాయి. ఆయన మరణానికి ముందు ఏదో జరగకూడని విషయం జరిగి ఉంటుంది అని అంకిత లోఖండే చెప్పారు.

అంకిత తాజా ట్వీట్ వైరల్
ఇలా తన భావాలను పంచుకొన్న అంకిత లోఖండే తాజాగా నర్మగర్భంగా ట్వీట్ చేశారు. ‘నా జీవిత కాలంలో వాళ్లు చాలా పనులు చేయించాలి ప్రయత్నించారు. అయితే వినమ్రంగా తలవంచి నాతో కావు అని చెప్పాను. నేను ఉన్నతమైన దైవమార్గంలో నడుస్తున్నాను. ఉన్నతమైన జన్మను పొందాను. నేను కొన్ని విషయాల్లో ఊగిసలాటకు గురికాను అని అంకిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Recommended Video

నన్ను ఎవరు కొనలేరు అంటూ నర్మగర్భంగా
ఒకరి కోసం నా ప్రయాణాన్ని మార్చకొను. నా హృదయం చెప్పినట్టు నడుచుకొంటాను. నా మనసు చెప్పినట్టు జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తాను. నన్ను ఎవరూ కొనలేరు.. అలాగని నేను ఎవరికి అమ్ముడుపోను అని అనే ఓ కొటేషన్‌ను అంకిత లోఖండే ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అనేక సందేహాలను రేకెత్తించింది. సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో అమ్మకాలు, కొనుగోళ్ల గురించి ఆమె మాట్లాడటం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











