నిజం నిప్పులాంటిది.. ఎప్పటికైనా అదే గెలుస్తుంది.. సుశాంత్ మాజీ ప్రేయసి షాకింగ్ ట్వీట్.. రియాపై కేసు

దివంగత సినీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తులో వేగంగా మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ముంబై పోలీసులతోపాటు బీహార్ పోలీసుల కూడా రంగంలోకి దిగారు. సుశాంత్ తండ్రి పాట్నాలో ఫిర్యాదు చేయడంతో చూపంతా రియా వైపు మరలింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసు దర్యాప్తు తన ప్రేయసి రియా చక్రవర్తి మెడకు చుట్టుకొన్నట్టు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో సుశాంత్ మాజీ ప్రేయసి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.. అంకితా లోఖండే చేసిన ట్వీట్ ఏమిటంటే..

సుశాంత్‌తో ప్రేమలో.. గుడ్‌బై

సుశాంత్‌తో ప్రేమలో.. గుడ్‌బై

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, అంకితా లోఖండే మధ్య పరిచయం పవిత్రు రిస్తా టెలివిజన్ సీరియల్ షూటింగులో జరిగింది. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం వారి మధ్య ప్రేమకు దారి తీసింది. సుశాంత్, అంకితా సుదీర్ఘ కాలంపాటు అఫైర్‌లో ఉన్నారు. వ్యక్తిగత అభిప్రాయ బేధాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. అయితే వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

నా కంటే ఎక్కువగా ప్రేమించే వారు దొరకరు

నా కంటే ఎక్కువగా ప్రేమించే వారు దొరకరు

సుశాంత్ అంటే అంకితా లోఖండేకు చెప్పలేనంత ఇష్టం. ఓ దశలో ట్వీట్ చేస్తూ.. నా కంటే ఎక్కువగా ప్రేమించే వారు ఎవరూ నీకు జీవితంలో దొరకరు అంటూ ట్వీట్ చేసింది. అప్పట్లో ఆ ట్వీట్ వైరల్ అయింది. సుశాంత్‌ను ఎప్పడూ గారబం చేసేదట. దేవుడు రూపంలో ఉండే పసివాడు అంటూ ఆటపట్టించేదనే విషయాన్ని సన్నిహితులు వెల్లడిస్తుంటారు.

సుశాంత్ మరణంతో షాక్‌లో

సుశాంత్ మరణంతో షాక్‌లో

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో అంకితా లోఖండే తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆ విషాదం నుంచి తేరుకోవడానికి చాలా సమయమే తీసుకొన్నట్టు కనిపిస్తున్నది. జూలై 14వ తేదీన జ్యోతి ప్రజ్వలన చేసి శాంతి పూజలో పాల్గొనడం ద్వారా సుశాంత్‌కు అంకిత శద్దాంజలి ఘటించారు. అయితే సుశాంత్‌కు న్యాయం జరుగాలని కోరుకొనే వారిలో అంకిత కూడా ఉన్నారు. అయితే కొద్దికాలంగా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు.

సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో

సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో

తాజాగా ముంబై పోలీసులు జరుపుతున్న దర్యాప్తుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు కావడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో అంకితా లోఖండే ట్విట్టర్‌లో ఘాటుగా, నర్మగర్భంగా స్పందించారు.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
ఎప్పటికైనా నిజానిదే విజయం

ఎప్పటికైనా నిజానిదే విజయం

సుశాంత్‌ కుటుంబ సభ్యులు దర్యాప్తు విషయంలో ఫిర్యాదు చేసి రంగంలోకి దిగడంతో పరిస్థితులు ఊహించని విధంగా మారిపోయాయి. వాస్తవం నిప్పులాంటిది. ఎప్పటికైనా నిజం విజయం సాధిస్తుంది అంటూ నర్మగర్భంగా అంకిత లోఖండే ట్వీట్ చేశారు. తాజాగా చోటుచేసుకొన్న పరిస్థితులపై ఆమె సంతృప్తికరంగా ఉందనే మాటను ఫ్యాన్స్ నోట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X