సుశాంత్ సూసైడ్ కేసు: యువ హీరోయిన్‌ను 7 గంటలు ప్రశ్నించిన పోలీసులు
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణను బాంద్రా పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో సుదీర్ఘంగా విచారిస్తున్నారు. సోమవారం యష్ రాజ్ ఫిలింస్ క్యాస్టింగ్ డైరెక్టర్‌ను విచారించిన పోలీసులు మంగళవారం హీరోయిన్ సంజనా సంఘీని ప్రశ్నించారు. సుశాంత్‌తో ఉన్న పరిచయాన్ని, అతడి మానసిక పరిస్థితిని అడిగి తెలుసుకొన్నట్టు సమాచారం.
ఇక సంజనా సంఘీ విషయానికి వస్తే... సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన దిల్ బేచారా చిత్రం ద్వారా బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ క్రమంలో సంజనా సంఘీకు సమన్లు జారీ చేసి మంగళవారం విచారించారు. దాదాపు సంజన విచారణ ఏడు గంటలపాటు సాగింది. అనంతరం సంజన చెప్పిన విషయాలను రికార్డ్ చేసుకొన్నట్టు తెలిపింది.

ఇక రియా చక్రవర్తి తర్వాత ఇలా సుదీర్గంగా విచారించిన వారిలో సంజనా సంఘీ రెండో వారు. రియా చక్రవర్తిని సుమారు 10 గంటలపాటు ప్రశ్నించారు. ఎందుకంటే రియా చక్రవర్తి, సుశాంత్ ఇద్దరూ లాక్‌డౌన్‌లో సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. ఇక సుశాంత్ సుసైడ్ కేసులో ఇప్పటి వరకు విచారించిన వారి సంఖ్య 28కి చేరుకొన్నట్టు సమాచారం. త్వరలోనే మరికొందరిని విచారించే అవకాశం ఉంది.
జూన్ 14వ తేదీన ఆత్మహత్య చేసుకొన్న తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అనేక సందేహాలను ప్రముఖులు, నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. డిప్రెషన్, బంధుప్రీతి కారణంగా సుశాంత్ సూసైడ్ చేసుకొన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బంద్రా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.


Click it and Unblock the Notifications











