Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
ప్రియుడితో సుస్మితా సేన్ పెళ్లి.. సహజీవనంపై క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే!
ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ సహజీవనం వార్తలు ఇటీవల కాలంలో వైరల్‌గా మారుతున్నాయి. ప్రియుడు, డిజైనర్ రోహన్ షాతో కొద్ది నెలలుగా లివింగ్ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్న విషయం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే త్వరలో టెలివిజన్ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రియుడు రోహన్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పెళ్లి గురించి వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే...
మీ ఇద్దరి జోడి బాగుంది అంటూ
ఇన్‌స్టాగ్రామ్‌లో రోహన్‌తో కలిసి సుస్మితా సేన్ మాట్లాడుతూ.. ఈ హ్యాండ్సమ్ అబ్బాయికి హాయ్ చెప్పండి అంటూ ప్రియుడు రోహన్‌ను పరిచయం చేశారు. ఈ సందర్భంగా సుస్మిత, రోహన్ జోడిని నెటిజన్లు అభినందించారు. వారిద్దరి జోడి చూడముచ్చటగా ఉంది అంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
మీ పెళ్లి ఎప్పుడంటే
సుస్మిత, రోహన్లిద్దరూ నెటిజన్లతో మాట్లాడుతుండగ.. మీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకొంటున్నారనే ప్రశ్న వారికి ముందుకు వచ్చింది. దాంతో రోహన్ స్పందిస్తూ.. అడిగి త్వరలోనే మీకు అన్ని విషయాలు చెబుతాను అంటూ కామెంట్ చేశారు. ఇంట్లోని వారినే కాకుండా ఇరుగుపొరుగు వారిని కూడా అడిగి.. వారి అభిప్రాయం తీసుకొంటాను అని రోహన్ చెప్పాడు.
సహజీవనంపై క్లారిటీ ఇచ్చిన ప్రియుడు
రోహన్ పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇవ్వడంతో వారి సహజీవనానికి, వారి మధ్య ప్రేమకు అధికారికంగా ఆమోదం లభించినట్టు స్పష్టమైంది. ఇప్పటి వరకు తమ బంధంపై నర్మగర్బంగా ఉన్న స్టార్ జంట ఇప్పుడు బహిరంగంగా తమ పెళ్లిపై స్పందించడానికి ముందుకు వచ్చారు. అయితే కొద్దికాలంగా వారిద్దరూ అధికారికంగా దంపతులు కావాలనే ఆలోచనలో ఉన్నట్టు కథనాలు వచ్చాయి.
కొద్ది నెలలుగా కలిసి జీవిస్తూ...
సుస్మితా సేన్ తన ఇద్దరు పెంపుడు కూతుళ్లు రెనీ, అలీసాతో కలిసి ముంబైలో ఉంటున్నారు. కొద్ది నెలలుగా రోహన్‌కు సుస్మిత చేరువయ్యారు. అప్పటి నుంచి సుస్మిత ఇంటిలోనే రోహన్ ఉంటున్నారు. సుస్మిత, రోహన్ కలిసి చేసే యోగా, వర్కవుట్ విన్యాసాలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆర్య వెబ్ సిరీస్‌తో అదరగొట్టిన సుస్మిత
ఇక సుస్మితా కెరీర్ విషయానికి వస్తే డిస్నీ+హాట్ స్టార్‌లో ఆర్య అనే వెబ్ సిరీస్‌లో నటించింది. డ్రగ్స్, కుటుంబ కలహాలు కథా నేపథ్యంగా వచ్చిన ఈ వెబ్ సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది. హీరోయిన్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో సుస్మిత నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ప్రస్తుతం తెలుగులోకి అనువదింపబడి ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్నది.
Recommended Video
ఫ్యాషన్ సూపర్‌స్టార్ షోలో
త్వరలోనే మింత్రా ఫ్యాషన్ సూపర్‌స్టార్ అనే టెలివిజన్ షోలో న్యాయమూర్తిగా సుస్మిత సేన్ పాల్గొనబోతున్నారు. ఈ షోలో మనీష్ మల్హోత్రా, కమెడియన్ మల్లికా దువా న్యాయమూర్తులుగా పాల్గొంటారు. ఇన్స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా నవరాత్రి, దుర్గపూజ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.