For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sushmita Sen: 15 ఏళ్ల చిన్నోడితో ఎఫైర్.. పబ్లిక్‌గానే రొమాన్స్.. పెళ్లికి ముందే ట్విస్ట్ ఇచ్చిన బ్యూటీ

  |

  సినిమా రంగంలో ప్రేమాయణాలు.. విడిపోవడం అనేవి సాధారణమైన విషయాలే అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగిలిన పరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా డేటింగులు చేసుకునే సినీ నటులు అక్కడ ఎంతో మందే ఉన్నారు. అలాంటి వారిలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ కూడా ఒకరు. అందంతో ప్రపంచాన్నే ఫిదా చేసిన ఆమె.. తనకంటే చిన్న వాడైన ఓ యువకుడితో చాలా రోజులుగా డేటింగ్ చేస్తోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఆమె ఏకంగా అతడితో ఇంట్లోనే కాపురమే పెట్టేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సుస్మితా తన ప్రియుడితో పాటు జనాలకూ షాకిచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

   విశ్వ సుందరిగా గెలిచిన సుస్మితా

  విశ్వ సుందరిగా గెలిచిన సుస్మితా

  సుస్మితా సేన్ మొదట మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఇందులో భాగంగానే 1994లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. ఆ తర్వాత మిస్ యూనివర్శ్ పోటీలకు అర్హత సాధించడంతో పాటు అక్కడ కూడా గెలుపొందింది. ఫలితంగా విశ్వ సుందరి కిరీటాన్ని అందుకుంది. అప్పటి నుంచి సుస్మితా సేన్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది.

  Pushpa 1 Week Collections: 146 కోట్ల టార్గెట్.. వారంలోనే అన్ని కోట్లు.. ఇంకెంత వస్తే హిట్ అంటే!

  నటిగా సత్తా చాటి.. దూరమైందిగా

  నటిగా సత్తా చాటి.. దూరమైందిగా

  మిస్ యూనివర్శ్ అయిన తర్వాత సుస్మితా సేన్‌కు అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి అవకాశాలు వచ్చాయి. కానీ, ఆమె చాలా వాటిని రిజెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే 1996లో 'దస్తక్' అనే హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంటర్ అయింది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు అందుకుంది. అయితే, 2015లో వచ్చిన బెంగాల్ చిత్రం 'నిర్భాక్' తర్వాత సినిమాలకు దూరమైపోయింది.

  పెళ్లి కాకుండానే తల్లైన సుస్మితా

  పెళ్లి కాకుండానే తల్లైన సుస్మితా

  దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో సుస్మితా సేన్‌ పర్సనల్ లైఫ్ విషయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా అప్పట్లో కొందరు హీరోలతో లవ్ ట్రాకులు సాగిస్తుందన్న వార్తలతో దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. వాటిని ఖండిస్తూనే పెళ్లికి సైతం దూరమైంది. కానీ తల్లి కావాలన్న కోరికతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని చాలా ఏళ్లుగా వాళ్లను పెంచుతోంది.

  ప్రియుడి నగ్న ఫొటోను షేర్ చేసిన శృతి హాసన్: అతడి ముందు అలా కూర్చుని.. పరువు తీసేసిందిగా!

   15 ఏళ్ల చొన్నోడితో డేటింగ్ చేస్తూ

  15 ఏళ్ల చొన్నోడితో డేటింగ్ చేస్తూ

  పర్సనల్ కారణాలతో నలభై ఏళ్ల వయసు దాటినా వివాహం చేసుకోలేదు సుస్మితా సేన్. ఇన్నేళ్ల కెరీర్‌లో పబ్లిక్‌గా డేటింగ్ చేస్తున్నట్లు కూడా ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ, కొన్నేళ్ల క్రితం రొహమన్ షాల్ అనే ఈ యువ మోడల్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తోంది. అంతేకాదు, ఏకంగా అతడిని తన ఇంట్లోనే ఉంచుకుంది. అదే సమయంలో ఈ బంధం గురించి ప్రకటించింది.

  పిల్లల ముందే రొమాన్స్ చేసింది

  పిల్లల ముందే రొమాన్స్ చేసింది

  రొహమన్‌తో డేటింగ్ చేస్తున్న విషయం బహిర్గతం అయిన తర్వాత సుస్మితా సేన్ మరింతగా రెచ్చిపోతోంది. తరచూ అతడి కలిసి రొమాన్స్ చేసిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే ఆ మధ్య తన పిల్లల ముందే బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్‌గా వర్కౌట్ చేస్తున్న పిక్స్‌ను షేర్ చేసింది. దీంతో ఈ భామపై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.

  Bigg Boss: సిరి క్యారెక్టర్‌పై సన్నీ సంచలన వ్యాఖ్యలు.. పాపం శ్రీహాన్.. ఆ విషయం చెబితే గొడవలే అంటూ!

  పెళ్లి అంటూనే విడిపోయిందిగా

  పెళ్లి అంటూనే విడిపోయిందిగా

  ప్రియుడితో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్న సుస్మితా సేన్.. త్వరలోనే రొహమన్‌ను వివాహం చేసుకోనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గత ఏడాది కరోనా భయం ఉండడంతో ఈ సంవత్సరం ఈ జంట అధికారికంగా ఒక్కటి కాబోతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి బ్రేకప్ చెప్పినట్లు అధికారికంగా ప్రకటించి అందరికీ షాకిచ్చింది.

   రిలేషన్ ముగిసిపోయింది అంటూ

  రిలేషన్ ముగిసిపోయింది అంటూ

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సుస్మితా సేన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'ఫ్రెండ్స్‌గా మొదలైన మా ప్రయాణంలో ఫ్రెండ్స్‌గానే మిగిలిపోతున్నాము. చాలాకాలం క్రితమే రిలేషన్‌షిప్‌ ముగిసింది కానీ ప్రేమ మిగిలింది. ఐ లవ్‌ యూ గయ్స్‌' అంటూ పోస్ట్ చేసింది. అలాగే, రొహమన్‌తో కలిసున్న ఫొటోను కూడా దీనికి జత చేసింది. ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  Former Miss Universe Sushmita Sen and Rohman Shawl Dated Long Days. Now She Announced her Breakup Via Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X