For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  15 ఏళ్ల చిన్నోడితో ఎఫైర్.. పబ్లిక్‌గానే రొమాన్స్: పెళ్లికి ముందు ప్రియుడికి షాకిచ్చిన హీరోయిన్

  |

  సినీ ఇండస్ట్రీలో డేటింగులు.. బ్రేకప్‌లు అనేవి సర్వసాధారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వయసుతో సంబంధం లేకుండా రొమాన్స్ చేసుకునే సినీ నటులు అక్కడ ఎంతో మందే ఉన్నారు. అలాంటి వారిలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ కూడా ఒకరు. తనకంటే చిన్న వాడైన ఓ యువకుడితో ఆమె చాలా రోజులుగా డేటింగ్ చేస్తోంది. ఏకంగా అతడితో ఇంట్లోనే కాపురం పెట్టేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియుడితో పాటు జనాలకూ షాకిచ్చింది. ఆ సంగతులు మీకోసం!

  విశ్వాన్నే గెలిచిన అందాల తారగ ఎంపిక

  విశ్వాన్నే గెలిచిన అందాల తారగ ఎంపిక

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది సుస్మితా సేన్. ఇందులో భాగంగానే 1994లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. ఆ తర్వాత మిస్ యూనివర్శ్ పోటీలకు అర్హత సాధించడంతో పాటు అక్కడ కూడా గెలుపొందింది. ఫలితంగా విశ్వ సుందరి కిరీటాన్ని అందుకుంది. అప్పటి నుంచి సుస్మితా సేన్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుని సత్తా చాటింది.

  సుదీర్ఘ కెరీర్.. అప్పటి నుంచి దూరమైంది

  సుదీర్ఘ కెరీర్.. అప్పటి నుంచి దూరమైంది


  విశ్వ సుందరిగా నిలిచిన తర్వాత సుస్మితా సేన్‌కు అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి అవకాశాలు వచ్చాయి. కానీ, ఆమె చాలా వాటిని రిజెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే 1996లో ‘దస్తక్' అనే హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంటర్ అయింది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగింది. అయితే, 2015లో వచ్చిన బెంగాల్ చిత్రం ‘నిర్భాక్' తర్వాత సినిమాలకు దూరమైంది.

  వాళ్లతో ఎఫైర్లు.. పెళ్లి కాకుండానే తల్లైంది

  వాళ్లతో ఎఫైర్లు.. పెళ్లి కాకుండానే తల్లైంది

  దాదాపు ఇరవై ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సుస్మితా సేన్‌ పర్సనల్ లైఫ్ విషయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా అప్పట్లో కొందరు హీరోలతో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. వాటిని ఖండిస్తూనే పెళ్లికి సైతం దూరమైంది. కానీ తల్లి కావాలన్న కోరికతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని చాలా ఏళ్లుగా పెంచుకుంటోందామె.

  15 ఏళ్ల చొన్నోడితో డేటింగ్.. హాట్ టాపిక్

  15 ఏళ్ల చొన్నోడితో డేటింగ్.. హాట్ టాపిక్

  నలభై ఏళ్ల వయసు దాటినా వివాహం చేసుకోలేదు సుస్మితా సేన్. ఇన్నేళ్ల కెరీర్‌లో పబ్లిక్‌గా డేటింగ్ చేస్తున్నట్లు కూడా ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ, కొన్నేళ్ల క్రితం రొహమన్ షాల్ (29) అనే ఈ యువ మోడల్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తోంది. అంతేకాదు, ఏకంగా అతడిని తన ఇంట్లోనే ఉంచుకుంది. అదే సమయంలో రొహమన్‌తో ప్రేమలో ఉన్నట్లో చాలా సార్లు బహిరంగంగానే ప్రకటించింది.

  వాళ్ల ముందే రొమాన్స్.. అన్నీ జంటగానే

  వాళ్ల ముందే రొమాన్స్.. అన్నీ జంటగానే

  రొహమన్ డేటింగ్ చేస్తున్న విషయం బహిర్గతం అయిన తర్వాత సుస్మితా సేన్ మరింతగా రెచ్చిపోతోంది. తరచూ అతడి కలిసి రొమాన్స్ చేసిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే ఆ మధ్య తన పిల్లల ముందే బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్‌గా వర్కౌట్ చేస్తున్న పిక్స్‌ను షేర్ చేసింది. దీంతో ఈ అమ్మడిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

  త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి.. షాకిచ్చిన సుస్

  త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి.. షాకిచ్చిన సుస్

  ఇంతగా రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్న సుస్మితా సేన్.. త్వరలోనే ప్రియుడు రొహమన్ వివాహం చేసుకోనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గత ఏడాది కరోనా భయం ఉండడంతో ఈ సంవత్సరం ఈ జంట అధికారికంగా ఒక్కటి కాబోతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియుడితో పాటు జనాలందరికీ షాక్ ఇచ్చిందీ మాజీ విశ్వ సుందరి.

  ఆ పోస్టుతో చెప్పకనే చెప్పేసిన సుస్మిత

  ఆ పోస్టుతో చెప్పకనే చెప్పేసిన సుస్మిత

  తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘స‌మ‌స్య ఏమిటంటే అత‌డు మారుతాడ‌ని మహిళ భావిస్తుంది. కానీ అత‌డు మార‌డు. పురుషులు చేసే త‌ప్పును ఆమె ఎప్పటికీ క్షమించ‌దు. ఆమె వ‌దిలి వెళ్లిపోతుంది. ఈ క‌థ‌లో నీతి ఏంటంటే అత‌డు మార‌డు. ఆమె వెళ్లిపోతుంది' అంటూ ఓ కొటేషన్ రాసుకొచ్చింది సుస్మిత. దీంతో ప్రియుడితో ఆమె బ్రేకప్ అయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

  English summary
  Former Miss Universe Sushmita Sen and beau Rohman Shawl are currently spending a blissful vacation in Armenia along with daughters Renee and Alisah. The stunning diva shared a beautiful picture with beau Rohman Shawl calling him a reason to smile.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X