‘24 ఏళ్ల వయసులో పెళ్లికాకుండానే తల్లీగా.. అతను అలా వదిలేసి పోయాడు’

హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. వరుస హిట్స్ పడితే మూడు నాలుగేళ్లు కెరీర్‌ను సాగించొచ్చు. మధ్యలో ఏదైనా ఫ్లాప్ పడిందా.. ఇక అంతే సంగతులు. దీనికి తోడు అందంలో మార్పులొచ్చినా, శరీరం బొద్దుగా మారినా కెరీర్‌పై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇక పెళ్లయినా, తల్లయినా హీరోయిన్ల కెరీర్‌ ముగిసినట్లేనని ఇండస్ట్రీలో వినిపించే మాట. అలాంటిది 24 ఏళ్ల వయసులో పెళ్లికాకుండానే తల్లయి ఎన్నో అవమానాలు పొందారు ఒక నటి . ఈ వివరాల్లోకి వెళితే..

ఆ నటి ఎవరో కాదు. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్. భారతదేశానికి తొలి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సాధించిన పెట్టి.. ఎందరినో మోడలింగ్ వైపు నడిపించారు సుస్మిత. మోడలింగ్ నుంచి సినీరంగం వైపు అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. దస్తక్‌తో హిందీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బీవీ నెంబర్ 1, సిర్ఫ్ తుమ్, దిల్బర్, నాయక్, ఫిల్హాల్, పైసా వసూల్, బేవాఫా, అలగ్, జిందగి రాక్స్, చింగారి తదిర సినిమాలో నటించారు. చివరిసారిగా నిర్బక్ అనే బెంగాలీ సినిమాలో నటించారు సుస్మితా. తెలుగులో కింగ్ అక్కినేని నాగార్జున సరసన రక్షకుడు మూవీలో ఆడిపాడారు ఈ బ్యూటీ. దాదాపు 10 ఏళ్లుగా వెండితెరకు దూరంగానే ఉంటున్నారు.

Sushmita Sen Faced Career Setback After Adopting Daughter at 24 Actress Gets Emotional

మోడలింగ్, సినిమాలు కంటే వివాదాలు, వ్యక్తిగత జీవితంతోనే సుస్మితా సేన్ వార్తల్లో నిలిచారు. బాలీవుడ్ స్టార్ రణదీప్ హుడా, రోహమన్ షావాల్, లలిత్ మోడీ తదితరులతో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచారు. 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు సుస్మిత. పలువురితో డేటింగ్ చేసినప్పటికీ ఏ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లలేదు ఈ మాజీ మిస్ యూనివర్స్. అన్ని రిలేషన్స్ కూడా ముణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. ప్రేమలో పడటం.. కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పడం సుస్మితకు అలవాటుగా మారిపోయింది.

ఈ వయసులోనూ ఎఫైర్లు, వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుస్మితా సేన్.. తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే 50 ప్లస్ లోనూ హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటారు. అయితే పెళ్లికాకుండానే ఇద్దరు పిల్లలను (రెనీ, అలీషా) దత్తత తీసుకుని వారికి తల్లిగా మారారు సుస్మిత. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల గురించి, తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుస్మిత.

రెనీని దత్తత తీసుకున్నప్పుడు నా పర్సనల్ మేనేజర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. నీకు కెరీర్ గురించి ఏమాత్రం శ్రద్ధ లేదు. 24 ఏళ్లకే తల్లిగా మారిన హీరోయిన్‌కు నేను మేనేజర్‌గా ఉండలేనని నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. హీరోయిన్‌గా నా కెరీర్ ముగిసనట్లేనని, ఇకపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మిగిలిపోతానని పలువురు హెచ్చరించారు. ఆ సమయంలో నాకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. కానీ మాతృత్వమే తనను మరింత దృఢంగా మార్చింది. రెనీని దత్తత తీసుకున్న తర్వాత ఆంఖే, మై హూ నా, మైనే ప్యార్ క్యూ కియా వంటి బ్లాక్‌బస్టర్స్‌లో నటించానని సుస్మిత తెలిపారు.

అంతకుముందు ఓ సందర్భంలో సుస్మిత మాట్లాడుతూ.. పిల్లలను దత్తత తీసుకునే సమయంలో చట్టరీత్యా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలో తన తండ్రి సుబీర్ సేన్ అండగా నిలిచారు. నా బిడ్డను పోషించుకోవడానికి కోర్ట్ ఆదేశాల మేరకు సగం ఆస్తిని రెనీ పేరిట రాసిచ్చారు. మంచి కుటుంబానికి చెందిన అబ్బాయి ఎవరూ కూడా నన్ను పెళ్లి చేసుకోరని ఆ సమయంలో మా నాన్నతో న్యాయమూర్తి హెచ్చరించారు. అయితే నేను ఎవరి భార్యగానో నా బిడ్డను పెంచలేదని నాన్న.. జడ్డిగారితో చెప్పారని సుస్మిత గుర్తుచేసుకుంది. ప్రస్తుతం సుస్మిత పెద్ద కుమార్తె రెనీ కూడా యాక్టింగ్ దిశగా అడుగులు వేస్తున్నారు.

Read more about: sushmita sen movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X