ప్రియుడికి తీవ్ర అనారోగ్యం.. మరోవైపు కోట్లు ఖరీదు చేసే కారుతో సుస్మితా సేన్.. గిఫ్టు ఎవరిచ్చారంటే?

బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ తరుచూ ఏదో వార్తతో మీడియాలో హాట్ టాపిక్‌గా మారడం తెలిసిందే. కొద్ది నెలల క్రితం ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీతో రిలేషన్‌షిప్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించి షాకిచ్చిన విషయం మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ఆర్థిక నేరాల ఆరోపణలతో లండన్‌కు పారిపోయిన లలిత్ మోడీతో సుస్మిత డేటింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తాజాగా విలాసవంతమైన, ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్‌ గిఫ్టుగా తీసుకోవడం మరోసారి సుస్మిత సేన్ సోషల్ మీడియాలో ప్రముఖంగా మారింది. సుస్మితా సేన్ కొత్త వాహనం మెర్సిడెజ్ బెంజ్ గురించి, దాని ధర వివరాల్లోకి వెళితే..

శనివారం అంటే.. జనవరి 21వ తేదీన సుస్మితా సేన్ తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా ఓ వార్తను పోస్టు చేసింది. నా కొత్త వాహనం మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ 53 ఏఎంజీ కూప్ అంటూ ఫోటోను షేర్ చేసింది. మహిళలు ఎవరైతే డ్రైవ్ చేయడానికి బాగా ఇష్టపడుతారో. అదే ఈ వాహనం. ఈ ఖరీదైన వాహనాన్ని నాకు నేనుగా గిఫ్టుగా ఇచ్చుకొన్నాను అంటూ పోస్టులో తెలిపింది. ఈ అనుభూతి మరువలేనిది అంటూ కామెంట్ చేసింది.

 Sushmita Sen gets gift brand new Mercedes GLE 53 AMG coupe vehicle, Can you guess Car Price?

తన ఇంటి ఆవరణలో కారుపై కప్పి ఉన్న కవర్‌ను తొలగించి కారును తన అభిమానులకు పరిచయం చేసింది. కారు కంపెనీ నిర్వాహకులు తాళం చేతులు ఇచ్చి ఆమెకు వాహనాన్ని అందజేశారు. కారు తాళాలు అందుకొన్న ఈ అందాల భామ.. డోరు తెరిచి.. అందులోకి వెళ్లింది. టెస్ట్ డ్రైవ్ చేసి తన ఆనందాన్ని పంచుకొన్నది.

ఇక Mercedes GLE 53 AMG coupe బ్రాండ్ న్యూ వాహనం విలువ 1.64 కోట్లు, ముంబైలో ఆన్ రోడ్ ధర విషయానికి వస్తే.. 1,92,98,718 రూపాయలు. ఈ ఖరీదైన వాహనం కొనుగోలుతో సుస్మితా సేన్ ముఖంలో ఆనందం తాండవించింది.

ఇక ఇదిలా ఉంటే.. తన తాజా ప్రియుడు లలిత్ మోడీ అనారోగ్యం బారిన పడ్డాడు. రెండోసారి కోవిడ్ బారిన పడటంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయనను లండన్ నుంచి మెక్సికోకు అంబులెన్స్ విమానంలో తరలించారు. తన కొడుకు సపర్యల వల్ల ప్రస్తుతం తన ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X