twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక తడాఖా చూపిస్తా.. 10 ఏళ్ల సుస్మిత సేన్ గ్రాండ్ రీ ఎంట్రీ.. డ్రగ్ దందాతో.

    |

    మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తాను యాక్టింగ్‌కు సిద్ధమేనని ప్రకటించారు. గతకొద్దికాలంగా యాక్టింగ్‌కు దూరంగా ఉన్న సుస్మిత తాజాగా ఆర్య అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్ డిస్నీ, హాట్‌స్టార్ యాప్‌లో త్వరలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నది. అయితే ఈ వెబ్ సిరీస్ సినిమా పరిశ్రమలో నా రీ ఎంట్రీకి సంకేతమని చెప్పడానికే అని సుస్మిత చెప్పారు.

    నేను యాక్టింగ్‌కు సిద్దమేనని చెప్పడానికే..

    నేను యాక్టింగ్‌కు సిద్దమేనని చెప్పడానికే..

    ఆర్య వెబ్ సిరీస్‌కు సంబంధించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ ద్వారా నేను సినిమాల్లో నటించడానికి సిద్ధమని చెప్పడమే ప్రధాన ఉద్దేశం. మళ్లీ నేను యాక్టింగ్‌కు రెడీ అవుతున్నాను. యాక్టర్‌గా నా కెరీర్‌కు ఉపయోగపడే సినిమాలు, వెబ్ సిరీస్‌లపై దృష్టిపెట్టాను. ఎవరైనా నాకు అవకాశం ఇస్తే.. నా తడాఖా చూపిస్తా. నాకు మంచి సినిమాలు, కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించాలని ఉంది అని అన్నారు.

     అక్రమ డ్రగ్ దందా నేపథ్యంగా

    అక్రమ డ్రగ్ దందా నేపథ్యంగా

    ఆర్య అనే క్రైమ్ థ్రిల్లర్‌లో సుస్మిత అక్రమ డగ్ర్ రాకెట్‌లో చిక్కుకున్న మహిళగా నటించారు. తన భర్తపై హత్యాయత్నం దాడి జరిగిన తర్వాత జరిగిన పరిణామాల కారణంగా యువతి ఎలాంటి తెగింపుకు పూనుకొన్నారు అనే కోణంలో కథ సాగుతుంది. దేవుడి దయ వల్ల అద్భుతమైన కంటెంట్ నా వద్దకు వచ్చింది. హాట్‌స్టార్ లాంటి అత్యంత ప్రేక్షకదారణ పొందిన ప్లాట్‌ఫాం ప్రదర్శించడం సంతోషంగా ఉంది. ఈ వెబ్ సిరీస్‌ కోసం నా ప్రాణం పెట్టినంత పని చేశాను. ఇలాంటి యూనిట్‌లో, కథా చిత్రంలో భాగమైనందుకు హ్యాపీగా ఉంది అని సుస్మిత అన్నారు.

    మిస్ యూనివర్స్‌గా 1996లో బాలీవుడ్ ఎంట్రీ

    మిస్ యూనివర్స్‌గా 1996లో బాలీవుడ్ ఎంట్రీ

    1994లో మిస్ యూనివర్స్‌ కిరిటాన్ని చేజిక్కించుకొన్న తర్వాత 1996లో తన నటజీవితాన్ని ప్రారంభించారు. దస్తక్ సినిమా ద్వారా బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆమె బీవీ నంబర్ 1, ఆంఖే, మై హూ నా, వాస్తు శాస్త్ర, మైనే ప్యార్ క్యూ కియా? చిత్రాల్లో నటించింది. 2010లో వచ్చిన నో ప్రాబ్లం సినిమా ఆమె ఆఖరి చిత్రం. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు.

     సుస్మిత వ్యక్తిగత జీవితం ఇలా

    సుస్మిత వ్యక్తిగత జీవితం ఇలా

    సుస్మిత వ్యక్తిగత జీవితానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ సెలబ్రిటీ రోహాన్ షాతో ప్రేమలో ఉన్నారు. ఆమె ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకొన్నారు. తన పెంపుడు కూతుళ్లు రీని, అలీషాలే ప్రస్తుతం సుస్మితకు ప్రపంచం. వారి సాన్నిహిత్యంలో లైఫ్‌ను పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు.

    English summary
    Sushmita Sen grand re entry into bollywood after 10 years. Sushmita Sen's latest flik Aarya as web series getting ready to load into Disney+Hotstar app.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X