twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది చనిపోయే పరిస్థితి... సుష్మితా సేన్‌‌కు స్టెరాయిడ్స్ ఎక్కించారు!

    |

    తెలుగు ప్రేక్షకులకు మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగార్జునతో కలిసి తెలుగులో 'రక్షకుడు' చిత్రంలో నటించింది. తాజాగా ఆమె ఓ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఆరోగ్య పరంగా ఎదుర్కొన్న అత్యంత గడ్డు పరిస్థితి గురించి వెల్లడించారు.

    2014లో తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడ్డానని, మరణం అంచులకు వెళ్లే పరిస్థితి వచ్చిందని, తప్పనిసరి పరిస్థితుల్లో స్టెరాయిడ్స్ ఎక్కించి బ్రతికించారని, అనారోగ్యం పాలవ్వడానికి కొన్ని రోజుల ముందే బెంగాళీ మూవీ 'నిర్బాక్' షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు.

    అడ్రినల్‌ గ్రంథి పని చేయడం ఆగిపోయింది

    అడ్రినల్‌ గ్రంథి పని చేయడం ఆగిపోయింది

    ఆ సమయంలో అడ్రినల్‌ గ్రంథి పని చేయడం ఆగిపోవడంతో ఆ ఎఫెక్ట్ శరీరంపై తీవ్రంగా పడిందని, ఆ కారణంగా తరచూ కళ్లు తిరిగి పడిపోయేదాన్ని అని సుష్మితా తెలిపారు. నేను బ్రతకాలంటే హైడ్రోకోర్టిసోన్‌ అనే స్టెరాయిడ్ తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఎనిమిది గంటలకోసారి దాన్ని తీసుకోకుంటే చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు సూంచినట్లు వెల్లడించారు.

    రెండేళ్ల తర్వాత కోలుకున్నాను

    రెండేళ్ల తర్వాత కోలుకున్నాను

    స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరం బాగా లావెక్కిపోయింది. జుట్టు రాలిపోయింది. మాజీ మిస్ వరల్డ్ అయిన నన్ను ఇలా చూస్తే జనం ఏమనుకుంటారో అనే భయం ఉండేది. దాంతో అస్సలు బయటకు వచ్చేదాన్ని కాదు. విదేశాల్లో చికిత్స తీసుకున్నాను. రెండేళ్ల తర్వాత తిరిగి మామూలు మనిషిని అయ్యాను. వైద్యులు కూడా స్టెరాయిడ్స్ ఆపేయమని సూచించడంతో నా ప్రాణం కుదుట పడ్డట్లు అయిందని తెలిపారు.

    పిల్లల కోసం సినిమాలు వదులుకున్నాను

    పిల్లల కోసం సినిమాలు వదులుకున్నాను

    పెద్ద కూతురు రెనీని దత్తత తీసుకున్నప్పుడు వర్క్ పరంగా చాలా బిజీగా ఉన్నాను. చిన్న కూతురు అలీసాను దత్తత తీసుకున్నపుడు పూర్తిగా సమయం తనకే కేటాయించాలని నిర్ణయించుకున్నాను. అందుకే సినిమాలకు దూరమైనట్లు సుష్మితా సేన్ తెలిపారు.

    సుష్మితా సేన్

    సుష్మితా సేన్

    2010లో ‘నో ప్రాబ్లం' సినిమా చేసేపుడు సుష్మితా సేన్ తన పెద్ద కూతురును దత్తత తీసుకున్నారు. తర్వాత ఆమె పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. మధ్యలో 2014లో నిర్భాక్ అనే బెంగాళీ సినిమా మాత్రమే చేశారు. ఇద్దరు పిల్లలు పెద్దవ్వడంతో మళ్లీ సినిమాపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆమె ‘హ్యాపీ యానివర్సరీ' అనే చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Sushmita Sen reveals about her steroid treatment. "I finished shooting for my Bengali film Nirbaak, and I fell violently sick. I had to take a medicine called hydrocortisone, which is a steroid, every eight hours to stay alive because my body no longer made that" she said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X