ప్రాణాలతో అలా బయటపడ్డాను.. సుస్మితా సేన్ వెల్లడించిన సీక్రెట్ ఏమిటంటే?
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ కొద్ది రోజుల క్రితం తీవ్రమైన గుండెపోటుకు గురవ్వడం అభిమానులను, సినీ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. సకాలంలో ఆమెను హాస్పిటల్‌లో చేర్పించడంతో ప్రాణాలకు ముప్పు తప్పింది. అయితే తనకు గుండెపోటు వచ్చిన విషయాన్ని ఆమె సీక్రెట్‌గా ఉంచింది.
ఆ తర్వాత తాను చికిత్స అనంతరం కోలుకొన్న తర్వాత తన గుండెపోటు వార్తను మీడియాకు, అభిమానులకు, బాహ్య ప్రపంచానికి వెల్లడించింది. అయితే తన ప్రాణాలు కాపాడుకోవడానికి కారణమైన విషయాన్ని ఇటీవల మీడియాను వెల్లడిస్తూ..

సుస్మితా సేన్ ఇటీవల ఇన్స్‌టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 28వ తేదీన నాకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. 99 శాతం నా హృదయ నాళాలు మూసుకుపోయాయి. నా ఫ్యామిలీ సకాలం స్పందించి హాస్పిటల్‌లో చేర్పించారు. దాంతో వేగంగా చికిత్స జరిపి నా ప్రాణాలను డాక్టర్లు కాపాడారు అని తెలిపారు.
మీలో చాలా మంది జిమ్‌కు వెళ్లడం మానేస్తారు. దాని వల్ల ఉపయోగం ఉండదని అనుకొంటారు. నేను జిమ్‌కు వెళ్లడం వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను. జిమ్‌లో వ్యాయామం చేయడం వల్ల తీవ్రమైన గుండెపోటును కూడా ఎదుర్కొన్నాను. గుండెపోటు నుంచి తేరుకొన్న తర్వాత ఇప్పుడిప్పుడే తేలికపాటి వ్యాయామాన్ని జిమ్‌లో చేస్తున్నాను అని సుస్మితా సేన్ చెప్పారు.

వ్యాయామానికి నాకు కార్డియాలజిస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఇప్పుడిప్పుడే నేను చిన్నపాటి ఎక్సర్‌సైజులు చేస్తున్నాను. జిమ్ వల్ల ఆరోగ్యం కంట్రోల్‌లో ఉంటుందని తెలిపారు.
గుండెపోటు తర్వాత 10 రోజులు విశ్రాంతి తీసుకొని తిరిగి సుస్మితా సేన్ షూటింగుకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆమె ఆర్య వెబ్ సిరీస్ సీక్వెల్‌లో నటిస్తున్నారు. ఈ షూటింగులో నిర్విరామంగా పాల్గొంటున్నారు.


Click it and Unblock the Notifications











