లాక్‌డౌన్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. ప్రియుడితో పిచ్చేక్కిపోయేలా రొమాన్స్(వీడియో)
మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లో డేటింగులు కాస్తా ఎక్కువ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఎన్నో ప్రేమ కహానీలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అంతే సంఖ్యలో కొనసాగుతున్నాయి కూడా. ఈ జాబితాలోకే వచ్చి చేరుతుంది మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్. ఇండియాలోనే అందగత్తెల్లో ఒకరిగా పేరొందిన ఆమె.. కొంత కాలంగా ఓ కుర్రాడితో ఎఫైర్ నడుపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా అతడితో కలిసి చేసిన రొమాంటిక్ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!
Recommended Video

మిస్ ఇండియా నుంచి యూనివర్శ్ వరకు
చదువు పూర్తయిన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది సుస్మితా సేన్. ఈ క్రమంలోనే 1994లో మిస్ ఇండియా పోటీల్లో విజయం సాధించింది. ఆ తర్వాత మిస్ యూనివర్శ్ పోటీలకు అర్హత సాధించడంతో పాటు అక్కడ కూడా గెలుపొందింది. ఫలితంగా విశ్వ సుందరి కిరీటాన్ని అందుకుంది. అప్పటి నుంచి సుస్మితా సేన్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది.

రెండు దశాబ్దాల కెరీర్... ఫస్ట్ & లాస్ట్ ఇవే
మిస్ యూనివర్శ్‌గా గెలుపొందిన తర్వాత సుస్మితా సేన్‌కు అన్ని ఇండస్ట్రీల నుంచి అవకాశాలు వచ్చాయి. కానీ, ఆమె చాలా వాటిని రిజెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే 1996లో ‘దస్తక్' అనే హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంటర్ అయింది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగింది. అయితే, 2015లో వచ్చిన బెంగాల్ చిత్రం ‘నిర్భాక్' తర్వాత సినిమాలకు దూరమైంది.

ఆ హీరోలతో లవ్.. పెళ్లి కాకుండానే తల్లైంది
సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో సుస్మితా సేన్‌కు ఎంతో మంది హీరోలతో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మీడియా ప్రభావం తక్కువగా ఉన్న రోజుల్లోనే ఆమె హైలైట్ అయింది. వాటన్నింటినీ ఆమె ఖండించినా ఫలితం లేకుండా పోయింది. ఇక, అప్పటి నుంచి సుస్మిత పెళ్లికి దూరంగా ఉంది. కానీ, తల్లి కావాలన్న కోరికతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని సాకుతోంది.

15 ఏళ్ల చిన్నవాడితో ఎఫైర్.. హాట్ టాపిక్
నాలుగు పదుల వయసులోనూ ఎంతో అందంగా కనిపించే సుస్మితా సేన్... కొన్నేళ్లుగా రొహమన్ షాల్ (29) అనే ఈ యువ మోడల్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. అంతేకాదు, ఏకంగా అతడిని తన ఇంట్లోనే ఉంచుకుంది. అదే సమయంలో రొహమన్‌తో ప్రేమలో ఉన్నట్లో చాలా సార్లు బహిరంగంగానే ప్రకటించింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.
పిల్లల ముందే రొమాన్స్.. అస్సలు తగ్గదు
రొహమన్ షాల్‌తో డేటిగ్ చేస్తున్న విషయం బయటకు వచ్చినప్పటి నుంచి సుస్మిత సేన్ మరింత రెచ్చిపోతోంది. అంతేకాదు, అతడితో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు, వీడియోలతో పాటు హాట్ వర్కౌట్‌కు సంబంధించిన పిక్స్ అన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అలాగే, ముద్దులిస్తున్నవి కూడా ఉన్నాయి. వీటిలో చాలా వరకు పిల్లల ముందు చేసినవే ఉండడం గమనార్హం.

లవర్‌తో లాక్‌డౌన్‌లో హాట్ హాట్‌గా ఫోజులు.!
తన వివాదాస్పద వ్యవహార శైలితో ఇప్పటికే ఎన్నోసార్లు వార్తల్లోకి ఎక్కిన సుస్మితా సేన్.. తాజాగా మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న ఈ జంట.. లాక్‌డౌన్‌లో హాట్ వర్కౌట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు, అతడిపై ఉన్న ప్రేమను మరోసారి బయట పెట్టింది.


Click it and Unblock the Notifications











