For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sushmita Sen ప్రియుడితో సహజీవనానికి గుడ్‌ బై.. ఇప్పటి వరకు ఎన్ని బ్రేకప్స్ తెలుసా?

  |

  మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ జీవితంలో మరోసారి అఫైర్ బ్రేకప్ జరిగింది. గత కొద్దికాలంగా మోడల్ రోహ్మన్ షా‌తో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే వారిద్దరూ సహజజీవనం చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ రేపారు. అయితే వారిద్దరూ పెళ్లి చేసుకొంటారని ఊహించిన అభిమానులకు ఆమె షాకిచ్చారు. రోహ్మన్‌తో బ్రేకప్ జరిగిందంటూ స్వయగా సుస్మిత వెల్లడించడంతో చర్చనీయాంశమైంది. సుస్మిత వ్యక్తిగత జీవితం, అఫైర్లు, బ్రేకప్స్ గురించి..

   1994లో మిస్ యూనివర్స్‌గా

  1994లో మిస్ యూనివర్స్‌గా

  సుస్మితా సేన్ 1994లో మిస్ యూనివర్స్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నది. హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే పలువురితో అఫైర్లు నడించాయి. అయితే తన అఫైర్ల గురించి ఎప్పడూ మాట్లాడలేదు. కానీ రోహ్మన్‌ డేటింగ్, సహజీవనం గురించి అధికారికంగా స్పందించింది.

  సుస్మిత జీవితంలో ఎన్ని బ్రేకప్స్ అంటే..

  సుస్మిత జీవితంలో ఎన్ని బ్రేకప్స్ అంటే..


  సుస్మితా సేన్ ముంబైకి చెందిన ఓ రెస్టారెంట్ బిజినెస్ మ్యాన్‌తో తొలి అఫైర్ కొనసాగించింది. వారిద్దరూ 2017లో విడిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడాతో డేటింగ్ చేసింది. అనంతరం వారిద్దరి రిలేషన్ ఎక్కువ కాలం సాగలేదు. ఆ తర్వాత ప్రస్తుతం సోనాక్షి సిన్హా ప్రియుడిగా చెప్పుకొంటున్న బంటీ సజ్దేహ్‌తో అఫైర్ పెట్టుకొన్నది. ఆ తర్వాత దర్శకుడు విక్రమ్ భట్, సంజయ్ నారంగ్‌తో రిలేషన్స్‌ను కొనసాగించింది. ఆ తర్వాత హాట్‌మెయిల్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాతో అఫైర్ నడిపించింది. ఆ తర్వాత దర్శకుడు ముదస్సర్ అజిజ్‌తో అఫైర్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అలాగే వసీం అక్రమ్‌తో కూడా కొంతకాలం రిలేషన్‌షిప్ ఉన్నారనే రూమర్లు వైరల్ అయ్యాయి.

  రోహ్మన్‌తో సహజీవనం అలా..

  రోహ్మన్‌తో సహజీవనం అలా..

  సుస్మిత, రోహ్మన్ మధ్య అఫైర్ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో జరిగింది. రోహ్మన్ సుస్మిత కంటే 15 ఏళ్లు చిన్నవాడు. అయితే రోహ్మన్‌తో అఫైర్‌ను కొనసాగించడానికి సుస్మిత ఇష్టపడలేదు. కానీ రోహ్మన్ నుంచి పాజిటివ్‌గా ప్రపోజల్ రావడతో ఆమె అంగీకరించాల్సి వచ్చింది. వారిమధ్య రిలేషన్ పాజిటివ్‌గా మారింది. సుస్మిత, ఆమె ఇద్దరు కూతుళ్లతో కలిసి పలు వేడుకలకు హాజరయ్యారు అని సుస్మిత సన్నిహితులు చెబుతుంటారు.

  పెళ్లి చేసుకోకపోయినా ఫ్యామిలీగా

  పెళ్లి చేసుకోకపోయినా ఫ్యామిలీగా

  సుస్మితా సేన్, రోహ్మన్ షా ఇద్దరు గత మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. గత మూడేళ్లలో వర్కవుట్ చేస్తూ.. పీకల్లోతు రొమాన్స్‌లో మునిగిపోయిన తమ ఫోటోలను షేర్ చేసి అభిమానుల్లో ఉత్సాహం పెంచారు. ఇటీవల సుస్మితాతో రిలేషన్ గురించి స్పందిస్తూ.. మేమిద్దరం పెళ్లి చేసుకోలేకపోయినా.. మేమంత ఒక ఫ్యామిలీ. సుస్మిత, తన కూతుళ్లు రీనీ, అలిషా, నేను ఓ కుటుంబంగా ఉంటున్నాం. నేను సుస్మిత పెంపుడు కూతుళ్లకు తండ్రిగా బాధ్యతను పోషిస్తున్నాను. మేమంతా అందరి మాదిరిగానే సాధారణ కుటుంబంగా జీవిస్తున్నాం అని రోహ్మన్ తెలిపారు.

  స్నేహితులుగా కలిశాం.. స్నేహితులుగానే..

  స్నేహితులుగా కలిశాం.. స్నేహితులుగానే..

  అయితే రోహ్మన్, సుస్మిత భార్యభర్తలు అన్నంత ఫీలింగ్‌తో గడిపేశారు. అయితే అంతా సవ్యంగా సాగుతుందని భావిస్తున్న సమయంలో వారిద్దరూ షాకింగ్‌గా విడిపోయారు. రోహ్మన్‌తో బ్రేకప్ గురించి సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ.. మేము స్నేహితులుగా కలిశాం. ఇక ముందు కూడా మేము ఫ్రెండ్స్‌గానే ఉంటాం. మా మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ఇక ఉండదు. కానీ మా మధ్య ప్రేమ అలానే ఉంటుంది. ఇంతకంటే మీరు ఎక్కువగా ఊహించుకోవద్దు అంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో తెలిపారు.

  సుస్మిత కెరీర్ ఎలా అంటే..

  సుస్మిత కెరీర్ ఎలా అంటే..

  సుస్మితా సేన్ కెరీర్ విషయానికి వస్తే.. ఆర్య అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ వెబ్ సిరీస్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. ఆర్య వెబ్ సిరీస్‌లో సుస్మిత నటన అందర్నీ ఆకర్షించింది. తాజాగా ఆర్యకు కొనసాగింపుగా ఆర్య 2 సీజన్ కూడా డిస్నీ+హాట్ స్టార్‌లో ప్రసారం అవుతున్నది.

  English summary
  Sushmita Sen Confirms Break Up with Rohman Shawl. She posted in Instagram that, We began as friends, we remain friends!! The relationship was long over…the love remains!! #nomorespeculations
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X