లేటు వయసులో రెచ్చిపోయిన సుస్మితా సేన్: స్విమింగ్ పూల్‌లో అందాల ఆరబోత

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎలాంటి వాళ్లైన ఇందులోనే మునిగిపోతున్నారు. తద్వారా ఎక్కువ సేపు దీనికే సమయం కేటాయిస్తున్నారు. ఇందులో సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఎంతో మంది హీరోయిన్లు సోషల్ మీడియా ఖాతాల ద్వారా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఫలితంగా సినిమాలు చేయకున్నా నిత్యం హైలైట్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

అలాంటి వారిలో మాజీ మిస్ యూనివర్శ్ సుస్మితా సేన్ ఒకరు. చాలా కాలం క్రితమే తన అందంతో మైమరపించిన ఈ భామ.. సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫొటోలనూ వదలుతూనే ఉంది. ఇప్పుడు 46 ఏళ్ల వయసులోనూ అందాల విందు చేస్తూ రెచ్చిపోతోంది. ఆమె తాజాగా వదిలిన పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి!

మిస్ యూనివర్శ్.. ఫుల్ పాపులర్

మిస్ యూనివర్శ్.. ఫుల్ పాపులర్

టీనేజ్‌లోనే సుస్మితా సేన్ మోడల్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది. ఆ రంగంలో తన అందాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆమె.. ఆ తర్వాత ఎన్నో పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఇందులో భాగంగానే 1994లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. ఆ తర్వాత మిస్ యూనివర్శ్ పోటీలకు అర్హత సాధించడంతో పాటు అక్కడ కూడా గెలిచి పాపులర్ అయింది.

సినిమాలకు గ్యాప్.. సిరీస్‌తో రాక

సినిమాలకు గ్యాప్.. సిరీస్‌తో రాక

మిస్‌ యూనివర్శ్‌గా గెలిచిన సుస్మితా సేన్‌ 1996లో 'దస్తక్' అనే హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది. అందులో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. వరుసగా అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే బడా హీరోలతోనూ కలిసి నటించి స్టార్ అయిపోయింది. 2015లో 'నిర్భాక్' తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే, గత ఏడాది ఆర్య అనే సిరీస్ చేసింది.

డేటింగ్ వార్తలు.. తల్లైన బ్యూటీ

డేటింగ్ వార్తలు.. తల్లైన బ్యూటీ

రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో సుస్మితా సేన్‌ పర్సనల్ లైఫ్ విషయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా అప్పట్లో కొందరు హీరోలతో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. దీంతో ఈ మాజీ మిస్ యూనివర్శ్ పెళ్లికి సైతం దూరమైంది. కానీ, తల్లి కావాలన్న కోరికతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వాళ్లను పెంచుకుంటోంది.

15 ఏళ్ల చొన్నోడితో లవ్ ట్రాక్‌తో

15 ఏళ్ల చొన్నోడితో లవ్ ట్రాక్‌తో

46 ఏళ్లు వచ్చినా సుస్మితా సేన్ వివాహం చేసుకోలేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో పబ్లిక్‌గా డేటింగ్ చేస్తున్నట్లు కూడా ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ, కొన్నేళ్లుగా రొహమన్ షాల్ (30) అనే ఈ యువ మోడల్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తోంది. అంతేకాదు, ఏకంగా అతడిని తన ఇంట్లోనే ఉంచుకుంది. ఈ క్రమంలోనే తరచూ అతడితో కలిసి రొమాన్స్ చేసిన ఫొటోలు, వీడియోలను వదిలేది.

పెళ్లి అంటూనే విడిపోయింది

పెళ్లి అంటూనే విడిపోయింది

రొహమన్ షాల్‌తో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్న సుస్మితా సేన్.. త్వరలోనే రొహమన్‌ను వివాహం చేసుకోనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గత ఏడాది కరోనా భయం ఉండడంతో ఈ సంవత్సరం ఈ జంట అధికారికంగా ఒక్కటి కాబోతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి బ్రేకప్ చెప్పినట్లు అధికారికంగా ప్రకటించి అందరికీ షాకిచ్చింది.

అందులో మాత్రం ఫుల్ బిజీగా

అందులో మాత్రం ఫుల్ బిజీగా

అప్పుడు చేతి నిండా సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా హాట్ హీరోయిన్ సుస్మితా సేన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ముందుకు సాగుతోంది.

స్విమ్‌సూట్‌లో రెచ్చిపోయింది

స్విమ్‌సూట్‌లో రెచ్చిపోయింది

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సుస్మితా సేన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ స్విమ్‌సూట్ ధరించి ఘాటు ఫోజు ఇస్తూ కనిపించింది. తద్వారా ఈ హాట్ బ్యూటీ అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా సుస్మితా సేన్ గ్లామర్ ట్రీట్ చేస్తోన్న ఈ ఫొటో భారీ రెస్పాన్స్‌తో వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X