అవును నేనా వ్యాధి బారిన పడ్డాను: సుస్మితా సేన్

రెగ్యులర్ గా సినిమాలు చేయకపోయినా ఏదొక విశేషంతో ఎప్పుడూ వార్తలకు ఎక్కుతూనే ఉంటుంది మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్. తాజాగా అమ్మడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అందరూ లాక్ డౌన్ పుణ్యమాని ఇంటి పట్టున సేదతీరుతుంటే... సుస్మితా మాత్రం... జిమ్ లో కసరత్తులు చేస్తూ... ఓ ఇన్స్పైరింగ్ వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియో వెనుక పెద్ద కథాకమామీషే ఉందట.

ఓకినావా యుద్ధకళలో ఉపయోగించే నున్చకూ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఆయుధంతోనే సుస్మిత రకరకాల విన్యాశాలు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా ఒడుపుగా నున్చకూను తిప్పేస్తున్న మాజీ విశ్వసుందరిని చూస్తుంటే ఎవరికైనా సరే రోమాలు నిక్కబుడుచుకోవడం ఖాయం. అయితే... అమ్మడి ప్రావీణ్యం వెనుక ఆరేళ్ల నాటి బాధాకరమైన కథ ఒకటి ఉందట.

Susmitha goes down the memory lane –Reveals her fight with Addisons disease

ఇంతకూ విషయం ఏమిటంటే... 2014లోనే సుస్మిత ఆడిసన్స్ వ్యాధిబారిన పడిందట. ఆటో ఇమ్యున్ సిస్టమ్ పై ప్రభావం చూపించే ఈ వ్యాధి వల్ల... డిప్రెషన్ కు లోనైందట. ఏమీ చేయలేని పరిస్థితిలో కార్టిసోల్ వంటి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్ లతో మరింత కుంగిపోయిందట సుస్మిత. ఇక ఇలా అయితే లాభం లేదని ఈ వ్యాధితో పోరాడేందుకు నున్చకును ఆశ్రయించిందట ఈ భామ.

అలా కొన్ని వారాలు, నెలలు కష్టపడ్డాక... తనలో మళ్లీ పూర్వపు ఉత్తేజం తిరిగి వచ్చిందని సుస్మిత అభిమానులతో షేర్ చేసుకుంది. మన శరీరాలను మనం మాత్రమే అర్థం చేసుకోగలమని వెల్లడించిన సుస్మిత... అందరిలోనూ ఓ వీరుడు ఉంటాడని తెలిపింది. ఏమైనా ఈ లాక్ డౌన్ లో డిప్రెస్ అవుతున్న వారందరికీ... సుస్మిత జీవిత పాఠాలు స్ఫూర్తినిస్తాయేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X