For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా కంటే 15ఏళ్ళు చిన్నవాడు.. నేను రొమాంటిక్ కాదు.. అలా ప్రేమ మొదలైంది: సీనియర్ నటి

  |

  డేటింగ్ అనే దానికి వయసుతో సంబంధం లేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది నటీమణులు ఇష్టం ఉన్న అబ్బాయి 15 ఏళ్లు పెద్దవాడైనా పట్టించుకోవడం లేదు. అలాగే మరికొందరు 15 ఏళ్ళు చిన్నవాడైనా అభ్యంతరం లేదని అంటున్నారు. ఇక సుష్మితా సేన్ లవ్ ట్రాక్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ అగ్ర నటిగా ఒకప్పుడు ఎంతగానో క్రేజ్ అందుకున్న ఆమె అనేక రకాల బ్రేకప్స్ అనంతరం ఒక కుర్రాడిని లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.

  అగ్ర హీరోయిన్.. హైదరాబాద్ అమ్మాయే..

  అగ్ర హీరోయిన్.. హైదరాబాద్ అమ్మాయే..

  సుష్మితా సేన్ బెంగాలీ అయినప్పటికీ పుట్టింది మాత్రం హైదరాబాద్ లోనే. ఇక 1996లో మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కిరిటల్ని అందుకొని సినిమా ఇండస్ట్రీని ఎట్రాక్ట్ చేసింది. మొదట తమిళ్ ఆ తరువాత బాలీవుడ్ లోకి వెళ్లి ఎన్నో బాక్సాఫీస్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. దాదాపు 9 ఏళ్ళ వరకు అమ్మడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది.

  యువకుడితో డేటింగ్

  యువకుడితో డేటింగ్

  ఇక ప్రస్తుతం సుష్మితా వయసు 45. గతంలో ఆమె కొంతమంది స్టార్స్ తో డేటింగ్ చేసినట్లు వార్తలు గట్టిగానే వచ్చాయి. ఒక సీనియర్ నటుడితో బ్రేకప్ అయిన తరువాత అమ్మడు పెళ్లిపై కూడా నమ్మకం కోల్పోయినట్లు ఒక టాక్ అయితే వస్తుంటుంది. ఇక గత మూడేళ్ళ క్రితం నుంచి సుష్మితా ఒక యువకుడితో డేటింగ్ చేస్తోంది. అంత చిన్నవాడిని లవ్ చేస్తానని అనుకోలేదని అమ్మడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

  ఇన్స్టాగ్రామ్ ద్వారా మొదలైన ప్రేమ

  ఇన్స్టాగ్రామ్ ద్వారా మొదలైన ప్రేమ

  ఇక సుష్మిత పెళ్లిపై గత కొన్నేళ్లుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఫ్యాషన్ మోడల్ రోహ్మాన్ షాల్‌తో సుష్మిత లవ్ లో ఉన్నట్లు రెగ్యులర్ గా చెబుతూనే ఉంది. ఇక ఇప్పటికే ఈ జంటకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఇక సుష్మితా సేన్ తన ప్రేమ గురించి ఒక పోస్ట్ చేసింది.

  నేను రొమాంటిక్ కాదు

  నేను రొమాంటిక్ కాదు

  ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన రోహ్మాన్ షాల్‌ నా కంటే వయసులో 15ఏళ్ళు చిన్నవాడు. అతనిని లవ్ చేస్తానని అనుకోలేదు. నేను రొమాంటిక్ పర్సన్ ని కాదు. కానీ స్నేహంగా మొదలైన ప్రయాణం ప్రేమగా మారింది. అనుకుంటే ఏది జరగదు. రాసి పెట్టి ఉండాలి. అదే నేను నమ్ముతాను. అతనితో ప్రేమలో ఉండడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోందని.. సుష్మిత వివరణ ఇచ్చింది.

  Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
  సుష్మితా సేన్ దత్తపుత్రక వెండితెర ఎంట్రీ

  సుష్మితా సేన్ దత్తపుత్రక వెండితెర ఎంట్రీ

  సుష్మిత దత్త పుత్రిక రెనీ సేన్ కూడా త్వరలోనే వెండితెరపైకి రానున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా శిక్షణ తీసుకుంటున్న ఆమె పూర్తిగా తన యాక్టింగ్ కెరీర్ కోసం సిద్ధమైందట. 21 ఏళ్ల రెనీ సుత్తాబాజీ అనే సినిమాతో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సాంప్రదాయిక కుటుంబంలో తన తల్లితో నిరంతరం పోటీ పడుతు వార్తల్లో నిలుస్తున్న రెనీ ఒక పవర్ఫుల్ డాటర్ గా జనాలను ఆకట్టుకుంటోంది.

  English summary
  susmitha sen about her boyfriend relationship special post viral, Renee Sen, daughter of former Miss Universe Sushmita Sen, is also expected to hit the silver screen soon. She has been training for the past few years and is fully prepared for her acting career. 21-year-old Renee Suttabaji is testing her luck as an actress with a movie. Renee impresses the crowd as a Powerful Daughter who stands out in the news as she constantly competes with her mother in a traditional family.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X