పెళ్లైన వ్యక్తితోనే రెండోసారి యువ హీరోయిన్ వివాహం
ప్రేమ, పెళ్ళి అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో స్పెషల్. ప్రేమ రెండు మనస్సులను ఒక్కటి చేస్తే.. పెళ్లి రెండు కుటుంబాలను, వారి ఆచారాలు, కట్టుబాట్లను ఒక్కటి చేస్తోంది. అందుకు పెళ్లిని ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకంగా భావిస్తాం. తమ వైవాహిక బంధం మరింత బలంగా ఉండాలని, పెళ్లి నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పెళ్లి రోజు వేడుకను కూడా చేసుకుంటారు. కానీ, ఓ యంగ్ హీరోయిన్ మాత్రం తన పెళ్లి రోజు నాడు అందరూ ఆశ్చర్యపోయేలా.. అందరూ చర్చించుకునేలా చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఇంతకీ అమ్మడు తీసుకున్న షాకింగ్ పనేంటీ? అని ఆలోచిస్తున్నారా? మీరు కూడా ఓ లూక్కేయండి.
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మలయాళం ముద్దుగుమ్మ స్వసిక. ఈ అమ్మడు 2009లో తమిళ చిత్రం వైగైలో కథానాయికగా నటించి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 2010లో మలయాళంలో ఫిడిల్ చిత్రంతో స్వసిక అరంగేట్రం చేసింది. ఈ సినిమా విజయం సాధించడంతో 'గొరిపాళయం' అనే సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది. ఇలా మలయాళం, తమిళంలో పలు చిత్రాల్లో నటించి, పలు విజయాలను అందుకుంది. ఈ అమ్మడు కెరీర్ లో 'ప్రభువింటే మక్కల్', 'కట్టప్పనయిలే రిత్విక్ రోషన్', 'పొరింజు మరియం జోస్', 'చతురం' వంటి సినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి.

ఈ అమ్మడు కేవలం సినిమాల్లోనే కాదు.. టీవీ సీరియల్స్‌లో కూడా నటించింది. 2014 నుంచి సీరియల్స్‌లో నటించడం ప్రారంభించాడు. మజావిల్ మనోరమలో ప్రసారమైన 'దత్‌పుత్రి' సీరియల్‌లో స్వసిక తొలిసారిగా నటించింది. ఈ సీరియల్ తో మంచి పేరు రావడంతో పలు సీనియల్స్ లో అవకాశం అందుకుంది. అలాగే.. పలు టీవీ రియాలిటీ షోలలో యాంకర్ గా వ్యవహరించింది. అమ్మడుకు 'వాసంతి' చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకుంది.
ఇలా సక్సెస్ పుల్ గా కెరీర్ ను సాగిస్తున్న ఈ అమ్మడు గతేడాది ఇదే రోజున స్టార్ మోడల్ ప్రేమ్ జాకబ్ ప్రేమించి, పెళ్లి చేసుకుంది. స్వసిక, ప్రేమ్‌లు 'మనంపోలే మాంగల్యం' అనే సీరియల్‌లోకలిసి నటించారు. ప్రేమ్ స్వస్థలం తిరువనంతపురం. మువాట్టుపుజాకు చెందిన విజయకుమార్, గిరిజ దంపతుల కుమార్తె స్వసిక. అసలు పేరు పూజా విజయ్. కాగా.. నేడు ఈ స్టార్ కపుల్ మొదటి వివాహ వార్షికోత్సవం. ఈ స్పెషల్ డేను మరింత స్పెషల్ గా లైఫ్ లాంగ్ గుర్తుకు ఉండిపోయేలా ఈ స్టార్ కపుల్ తమ మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మళ్లీ పెళ్లి చేసుకున్నారు. మొదటి వివాహ వార్షికోత్సవం రోజున తమిళ ఆచారంలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వెడ్డింగ్ ఫోటోషూట్ నెట్టింట్లో వైరలవుతోంది.

ఈ స్టార్ కపుల్స్ తన వెడ్డింగ్ షూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా రాసుకోచ్చారు. ' ఒక సంవత్సరం గడిచిపోయింది. తమిళంలో మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది షూట్ అయినప్పటికీ, మా ఇద్దరికీ ఇది నిజమైన పెళ్లిలా అనిపించింది' అని ట్విట్ చేశారు. దీంతో సెలబ్రిటీలతో పాటు పలువురు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు.


Click it and Unblock the Notifications











