స్టార్ హీరోయిన్ చేతిపై వింత మచ్చ... అలాంటి కామెంట్స్‌తో దారుణంగా ట్రోలింగ్
సోషల్ మీడియా రాకతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై లేనిపోని పుకార్లతో పాటు వారి కుటుంబ సభ్యులపైనా దారుణమైనా కామెంట్స్ పెడుతున్నారు. కొందరు వీటిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదులు చేస్తుండగా మరికొందరు మాత్రం చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారినపడ్డారు సంయుక్త మీనన్. ఈ వివరాల్లోకి వెళితే..
భీమ్లానాయక్‌తో టాలీవుడ్‌లోకి
కేరళ నుంచి టాలీవుడ్‌లోకి దిగుమతి అయిన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్. మాతృభాషలో కొన్ని సినిమాలు చేసి విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త .. ఆపై కొన్ని తమిళ చిత్రాలు చేసింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగువారిని పలకరించారు సంయుక్త. ఆ తర్వాత బింబిసార, సార్, విరూపక్ష, లవ్ మీ, అఖండ 2, నారీ నారీ నడుమ మురారి చిత్రాలతో హిట్స్ అందుకున్నారు. సంయుక్త ఏ సినిమాలో నటించినా ఆ మూవీ ఖచ్చితంగా హిట్ అనే సెంటిమెంట్ టాలీవుడ్‌లో బలంగా ఉంది.

లక్కీ హ్యాండ్‌గా సంయుక్త మీనన్
దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో హిట్ అందుకున్న హీరో శర్వానంద్ కూడా ఈ సెంటిమెంట్‌ను అంగీకరించారు. తనకు హిట్ ఇచ్చినందుకు సంయుక్తకు థ్యాంక్స్ చెబుతూ... అందరి హీరోలతో నటించాలని ఆకాంక్షించారు. లక్కీ హ్యాండ్‌గా ముద్రపడిన సంయుక్త కోసం దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. ఆమె చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయంటే సంయుక్త హవా ఎలా సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలుగులో స్వయంభూ, స్లమ్ డాగ్ : 33 టెంపుల్ రోడ్.. హిందీలో మహారాణి క్వీన్ ఆఫ్ క్వీన్స్.. తమిళంలో బెంజ్.. మలయాళంలో రామ్ చిత్రాల్లో నటిస్తున్నారు సంయుక్త మీనన్. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
ఏప్రిల్ 10న స్వయంభూ
నిఖిల్ సిద్ధార్ధ్ హీరోగా సంయుక్త మీనన్, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటించిన స్వయంభూ చిత్రం విడుదలకు సిద్ధమైంది. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్ అండ్ శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సుబ్బరాజు, సునీల్, సత్య తదితరులు స్వయంభూలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. విజయ్ కామిశెట్టి సంభాషణలు అందించగా.. కింగ్ సొల్మొన్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, చైనీస్, స్పానిష్, అరబిబ్ భాషలలో స్వయంభూ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమం ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరిగింది.
రెండేళ్ల కష్టం
ఈ కార్యక్రమానికి హాజరైన సంయుక్త మాట్లాడుతూ.. స్వయంభూ కోసం దర్శకుడు ఎంతో రీసెర్చ్ చేశారు. ఇప్పుడు అంతా ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. కానీ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఎంతో నాలెడ్జ్ కావాలి. ఈ కథ గురించి నిఖిల్ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయా.. ఈ సినిమా కోసం నటీనటులు, టెక్నీషియన్లు ఎంతో కష్టపడ్డారు. అగ్రిమెంట్ మీద సంతకం చేసే సమయంలో చిన్న చిత్రంగా ఉన్న స్వయంభూ.. ఆ తర్వాత పాన్ ఇండియా మూవీగా మారింది. సెంథిల్ గారు కామ్‌గా తన పని చేసుకుంటూ వెళ్లేవారు. రెండేళ్ల నుంచి స్వయంభూ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ను ఈ చిత్రం అందుకుంటుందని సంయుక్త మీనన్ అన్నారు.
సంయుక్తపై ట్రోలింగ్
ఈ ఈవెంట్‌కు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిన సంయుక్త ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు అందరి కళ్లు ఆమె చేతిపైనే పడ్డాయి. దీనికి కారణం.. ఆమె చేతిపై కనిపిస్తోన్న గుర్తు. ఇది గాయం తాలూకా గుర్తులా ఉంది. స్వయంభూ కోసం సంయుక్త కత్తిసాము, ఇతర యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ ఏదైనా గాయమైందా? లేక మరేదైనా కారణం ఉందా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసేలా దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారగా... సంయుక్త మీనన్ స్పందించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











