అతిలోక సుందరి శ్రీదేవికి అరుదైన గౌరవం.. స్విస్‌లో ఏం చేస్తున్నారో తెలుసా!
అతిలోక సుందరి శ్రీదేవికి మరో గౌరవం దక్కబోతోంది. అది భారత ప్రభుత్వం ఇవ్వబోతున్న బిరుదో, అవార్డో కాదు. పర్యాటకులకు స్వర్గధామమైన స్విట్జర్లాండ్ ప్రభుత్వం శ్రీదేవి విగ్రహాన్ని నిర్మించబోతోంది. దిగ్గజ దర్శకుడు యాష్ చోప్రా విగ్రహాన్ని 2016 లో స్విట్జర్లాండ్ లో నిర్మించారు. ఆయన తరువాత ఆ గౌరవం దక్కించుకోబోతోంది శ్రీదేవే కావడం విశేషం.
శ్రీదేవి నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ చాందినిని స్విస్ లోని అందమైన ప్రదేశాల్లో చిత్రికరించారు. ఆ చిత్రానికి గుర్తుగా శ్రీదేవి విగ్రహాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ దర్శకుడు యాష్ చోప్రా ఎక్కువగా తన చిత్రాలని స్విస్ లోనే తెరకెక్కించేవారు. ఆ తరువాత భారతీయ సినిమాల తాకిడి స్విస్ కు పెరిగింది.

భారతీయ పర్యాటకులని ఆకర్షించేందుకు స్విస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీదేవి ప్రమాదవశాత్తు దుబాయ్ లోని హోటల్ లో మరణించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











