twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విధ్వంసమైన కార్యాలయం... అతివ తెగువకు ప్రతీక... వెనక్కుతగ్గని కంగన

    |

    కంగన రనౌత్ పేరు రాజకీయాల్లోనూ పెను దుమారమే లేపుతోంది. తనది కానీ పోరాటంలోనూ వెనకక్కు తగ్గని ఆమె దూకుడుకి మహారాష్ట్రా ప్రభుత్వమే కదలిపోతోంది. కానీ, ఆమె సంకల్పం మాత్రం పట్టు విడవడంలేదు.

    సుశాంత్ సింగ్ మరణంతో బాలీవుడ్ మాఫియాపై మొదలైన ఆమె పోరు, క్రమంగా డ్రగ్స్ మాఫియా వైపు... చివరకు ముంబై రాజకీయ లసుగులవైపు సాగిన వైనం ప్రతి రోజూ కళ్లకు కడుతూనే ఉంది. అసలే రగిలిపోతున్న పులికి ఛాలెంజ్ విసిరితే ఎలా ఉంటుందో ముంబై నేతలకు తెలసి వచ్చింది. ఈ నేపథ్యంలో తన కలల కోట నేల మట్టం చేసేందూకూ వెనకాడని ప్రభుత్వాన్ని ఎదురించి నిలబడ్డ కంగన... బీఎంసీ అధికారులు ధ్వంసం చేసిన తన ఆఫీస్ నుంచే పని మొదలుపెడతానని శపథం చేసింది.

    Symbol Of Womens will - Kangana

    పాక్షికంగా ధ్వంసమైన తన కార్యాలయాన్ని సందర్శించిన కంగన, ఇది మగువ తెగువకు ప్రతీకగా నిలుస్తుందని ట్వీట్ చేసింది. తన దగ్గర ఉన్నదంతా ఈ ఆఫీస్ పైన ఖర్చుపెట్టేశానని, లాక్ డౌన్ అయిన దగ్గర నుంచి తాను పనిచేయకపోవడం వల్ల ఇప్పడు తన వద్ద కార్యాలయాన్ని పునర్ నిర్మించేందుకూ డబ్బు లేవని స్పష్టం చేసింది. అంతేకాదు, మగువ తెగువకు ప్రతీకగా ఈ ధ్వంసమైన ఆఫీస్ నుంచే పనిచేస్తానని, ఇదే తన ప్రగతికి పునాది అని ప్రకటించింది.

    మరో ట్వీట్ ద్వారా తన తల్లి మీడియాతో చెప్పిన మాటలు తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయని వెల్లడించింది. కంగన తల్లి ఆశా, తన బిడ్డకు రక్షణ కల్పించిన భాజాపా సారధి అమిత్ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తన కూతురి పట్ల గర్వంగా ఉందటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ముంబైలోనే ఉన్న కంగన, వచ్చే వారం తిరిగి మనాలీ బయలుదేరనున్నారు.

    English summary
    Kangana dares to work from the ruins of her office which was demolished. The actress said she will not renovate the office as she is running out of the money and Says its a symbol of womens will.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X