Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్‌తో హీరోయిన్ తాప్సీ డేటింగ్, పెళ్లి ఎప్పుడంటే?
Recommended Video
హీరోయిన్ తాప్సీ రహస్యంగా ప్రేమాయణం నడుపుతున్నట్లు, ఆమె జీవితంలో ఒక వ్యక్తి ఉన్నట్లు కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీలైనంత మేరకు ఈ విషయం బయటకు పొక్కకుండా తాప్సీ జాగ్రత్త పడుతోంది. అయితే ఎట్టకేలకు ఈ పంజాబీ బ్యూటీ ఈ విషయంలో కాస్త ఓపెన్ అయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నట్లు హింట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాను రిలేషన్ఫిప్లో ఉన్నట్లు ఒప్పుకున్న తాప్సీ... తన బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే విషయం మాత్రం బయట పెట్టలేదు.
సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదు
తన జీవితంలో ఉన్న వ్యక్తి అందరూ ఊహించినట్లు ఇండస్ట్రీికి చెందిన వ్యక్తి కాదు, అలా అని క్రికెటర్ అసలే కాదు అని తాప్సీ స్పష్టం చేశారు. ఇలా చెప్పడం ద్వారా ఇతర స్టార్లతో తనకు లింకప్ పెట్టి ఊహాగానాలతో కూడిన వార్తలు రాకుండా కట్టడి చేసే ప్రయత్నం చేశారు.
హాట్ ఫొటోస్: రెచ్చిపోయిన తాప్సీ.. న్యూడ్ ఫొటోతో మతి పోగొట్టేస్తుంది
అలాంటి వ్యక్తులు ఆ విషయం కూడా తెలుసుకోవాలి
నేను వివాహం చేసుకోలేదు, నా జీవితంపై నిజమైన ఆసక్తి ఉన్న వ్యక్తులు నాపై గాసిప్ కాలమ్స్ మాత్రమే రాయడం కాకుండా, నా జీవితం గురించిన నిజాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. నా జీవితంలో ఉన్నది మీరు ఊహించే వ్యక్తి కాదు, ఆయన అసలు సెలబ్రిటీ కూడా కాదు అని తాప్సీ వెల్లడించారు.
నా రాకుమారుడిని కలవడానికి ముందు చాలా కప్పలను ముద్దాడాను
నా రాకుమారుడిని కలవడానికి ముందు నేను చాలా కప్పలను ముద్దాడాను... అంటూ తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా తనకు సరిపోయే వ్యక్తిని ఎంచుకోవడానికి ముందు చాలా మంది అనవసర వ్యక్తులను కలిసినట్లు వెల్లడించే ప్రయత్నం చేశారు.
పిల్లలు కావాలనుకున్నపుడే పెళ్లి చేసుకుంటాను
నాకు ఎప్పుడు పిల్లలు కావాలనిపిస్తుందో అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. వివాహం అయిన తర్వాతే పిల్లలను కనాలని అనుకుంటున్నాను. వివాహాన్ని కూడా ఆడంబరంగా జరుపుకోవాలని అనుకోవడం లేదు. ఒకే రోజులో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకోవాలని ఉంది, ఎక్కువ రోజులు వివాహ వేడుక వల్ల అంతా అలసిపోతారు అని తాప్సీ చెప్పుకొచ్చారు.