రెమ్యునరేషన్ కట్ చేసినా ఫర్వాలేదు.. వారి కోపంలో అర్థముంది: తాప్సి పన్ను
సొట్ట బుగ్గల సుందరి తాప్సి పన్ను ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీ కామెంట్స్ తో కాస్త ఎక్కువగానే హడావుడి చేసింది. సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ గురుంచి చెబుతూ.. భవిష్యత్తు ఫ్యామిలీ లైఫ్ గురించి కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. అలాగే సోషల్ మడియాలో ఫాలోవర్స్ నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు కూడా తాప్సి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఇకపోతే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా నిర్మాతలు నష్టపోకూడదని కొంత మంది సినీ తారలు వారి రెమ్యునరేషన్స్ ని కట్ చేసుకొని నిర్మాతలకు సహాయపడుతున్నారు. ఇదే తరహాలో మీరు ఏమైనా ఆలోచించారా అని తాప్సిని ఒక నెటీజన్ ప్రశ్నించాడు.

అందుకు తాప్సి కూడా పాజిటివ్ గా సమాధానం ఇచ్చింది. రెమ్యునరేషన్ కట్ చేసిన పరవాలేదు. కానీ ఇప్పుడు మాకు షూటింగ్స్ లేవు, జీతాలు రావడం లేదు. భవిష్యత్తులో పారితోషికం తగ్గించుకోవడానికి సిద్ధమేనని ఈ బ్యూటీ వివరణ ఇచ్చింది.
అదే విధంగా ఓటీటీలో సినిమాల్ని రిలీజ్ చేస్తుండడంతో థియేటర్స్ ఓనర్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై తాప్సి స్పందించింది. నిజానికి వారి కోపంలో అర్థం ఉందని, ఇప్పుడున్న కష్టకాలంలో ప్రతి మనిషి కష్టం మరొకరిపై ప్రభావం చూపుతోందని అన్నారు. అయితే సమస్యలు సర్దుకోవాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదని కూడా తాప్సి వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











