For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Taapsee Pannu: బికినీ కంటే ఇందులోనే సెక్సీ అంటూ.. అలాంటి డ్రెస్ లో షాక్ ఇచ్చిన తాప్సి..

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొదట వరుసగా అవకాశాలు అందుకొని బ్యూటీఫుల్ హీరోయిన్ గా గుర్తింపు అందుకున్న తాప్సి పన్ను ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ బ్యూటీ కేవలం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా విభిన్నమైన కథలను కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉండడం విశేషం.

  అవసరం అయితే కొన్ని సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ కూడా తగ్గించి గుర్తింపు కోసం నటించాలని చూస్తోంది. ఇక తాప్సి చాలా కాలం తరువాత ఒక సరికొత్త గ్లామర్ లుక్ తో కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలలో షేర్ చేసుకోగా నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఆ పోటో వివరాల్లోకి వెళితే..

  మొదటి సినిమాతోనే..

  మొదటి సినిమాతోనే..

  దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఝుమ్మంది నాథం సినిమాతో వెండితెరకు పరిచయమైన తాప్సి మొదటి సినిమాతోనే అందరిని తన అందంతో ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ బ్యూటీ తప్పకుండా జెట్ స్పీడ్ లోనే అగ్ర హీరోయిన్ గా టాలీవుడ్ లో చక్రం తిప్పుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగకపోగా.. ఆమె చేసిన మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫెయిల్ అయ్యాయి.

  ఆ తరువాత బాలీవుడ్..

  ఆ తరువాత బాలీవుడ్..

  అప్పుడప్పుడు కొన్ని మిడియం రేంజ్ సినిమాలు తప్పితే తాప్సి తెలుగులో సోలో హీరోయిన్ గా అనుకున్నంతగా హిట్స్ ఏమి అందుకోలేకపోయింది. తెలుగులో గోపిచంద్ తో చేసిన సాహసం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత అమ్మడికి బాలీవుడ్ లో ఈజీ గా ఆఫర్స్ వచ్చాయి. ఇక తాప్సీ ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఆమె స్థాయి కూడా మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది.

  ఆ మాటలతో వివాదం..

  ఆ మాటలతో వివాదం..

  ఇక ఆ మధ్య కాలంలో తాప్సీ తెలుగు సినిమాలపై కొన్ని కామెంట్స్ చేయడం వివాదానికి దారి తీసింది. తన మొదటి సినిమా కె.రాఘవేంద్రరావు తో తీయగా అందులో అందాన్ని పూలతో పండ్లతో ఎక్కువగా చూపిస్తారు అని సెటైర్ వేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో ఆమె పై నెగిటివ్ ప్రభావాన్ని చూపించింది. కానీ వెంటనే తను చెడుగా ఏమీ అనలేదు అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా వెంటనే రాఘవేంద్రరావు కూడా ప్రత్యేకంగా కలిసింది.

  తెలుగులో ఎందుకు చేయడం లేదంటే..

  తెలుగులో ఎందుకు చేయడం లేదంటే..

  ఇక తాప్సీ తెలుగులో ఆనందో బ్రహ్మ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పరవాలేదు అనే విధంగా మంచి విజయాలను అందుకుంది. తెలుగులో ఆమెకు ఆఫర్స్ వస్తున్నప్పటికీ కూడా ఎందుకు చేయడం లేదు అని కథనాలు కూడా వెలువడుతున్నాయి. కానీ తాప్సీ మాత్రం ఏదైనా సరే ముందు తనకు కథ కాన్సెప్ట్ అలాగే క్యారెక్టర్ నచ్చితేనే చేస్తాను అని వివరణ ఇచ్చింది.

  అందమైన ఫొటోలతో..

  అందమైన ఫొటోలతో..

  ఇక రీసెంట్ గా తాప్సీ సోషల్ మీడియాలో కొన్ని గ్లామరస్ ఫోటోలను షేర్ చేసుకుంది. ఆ ఫోటోలలో అయితే తాప్సి చాలా అందంగా కనిపిస్తోంది. ఆమె సరికొత్తగా ఉండాలని క్లివేజ్ అందాలను కూడా హైలైట్ చేసింది. ఒక విధంగా ఈ లుక్కుతో అయితే తాప్సీ బికినీ లో కంటే అందంగా ఉంది అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. గతంలో తాప్సీ కొన్ని బికినీ ఫోటోలతో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం ఆమె అంతకు మించి అనేలా అందంగా ఉంది అని చెబుతున్నారు.

  Recommended Video

  Tapsee Pannu Targets Sandeep Reddy Vanga In Her Style || Filmibeat Telugu
  మరో రేంజ్ కు వెళ్లినట్లే..

  మరో రేంజ్ కు వెళ్లినట్లే..

  ఇక ప్రస్తుతం తాప్సీ చేతిలో అయితే చాలా మంచి సినిమాలు ఉన్నాయి. హిందీ తమిళ్ తెలుగు మూడు భాషల్లో మంచి ఆఫర్లను అందుకునే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా ఇండియన్ ఉమెన్ క్రికెటర్ మిథాలి రాజ్ బయోపిక్ లో కూడా నటిస్తోంది. తమిళంలో రెండు సినిమాలు అలాగే హిందీలో కూడా మరొక నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి వీటిలో ఏది హిట్ అయినా కూడా తాప్సీ కెరీర్ మరో రేంజ్ కు వెళ్లినట్లే అని చెప్పవచ్చు.

  English summary
  Taapsee Pannu beautiful photo viral in social media..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X