twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుస సినిమాలతో భారీ సంపాదన: బ్యాడ్మింటన్ టీమ్ కొంటున్న తాప్సీ!

    |

    హీరోయిన్ తాప్సీకి ఈ సంవత్సరంగా బాగా కొలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ ఏడాది ఆమె నటించిన సూర్మ, ముల్క్, మన్మర్జియాన్ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాలకు అభిమానుల నుండి, క్రిటిక్స్ నుండి మంచి మంచి స్పందన వచ్చింది. అంతేకాదు ఈ సినిమాల ద్వారా అమ్మడు డబ్బు కూడా బాగానే పోగేసింది.

    సాధారణంగా నటీనటులు సినిమాల ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తే నిర్మాతగా మారాలనే ఆలోచన చేస్తారు. లేదంటే ఏదైనా సైడ్ బిజినెస్ ప్లాన్ చేస్తారు. ఇపుడు తాప్సీ కూడా అలాంటి ప్లానే వేసింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ఓ టీమ్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    నా జీవితంలో ఇదే బిగ్గెస్ట్ వెంచర్

    నా జీవితంలో ఇదే బిగ్గెస్ట్ వెంచర్

    ఈ విషయమై తాప్సీ మాట్లాడుతూ... తన జీవితంలో ఇప్పటి వరకు ఇదే బిగ్గెస్ట్ వెంచర్. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, బాడ్మింటన్ టీమ్ కొనుగోలు చేయబోతుండటం ఆనందంగా ఉంది. ఈ వెంచర్‌ను ఎలా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయాలనే దానిపైనే కాన్సట్రేట్ చేయబోతున్నాను అని వెల్లడించారు.

    టీమ్ కొనడానికి కారణం అదే

    టీమ్ కొనడానికి కారణం అదే

    బాడ్మింటన్ టీమ్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందనే ప్రశ్నకు తాప్సీ రియాక్ట్ అవుతూ... స్పోర్ట్స్‌లోకి వెళ్లాలనే కోరిక ఎప్పటి నుండో ఉండేది. కానీ అటువైపు వెళ్లలేక పోయాను. ప్రాక్టికల్‌గా వర్కౌట్ కాలేదు. అందుకే స్పోర్ట్స్‌కు సంబంధించిన వాటితో అసోసియేట్ అవ్వాలనుకున్నాను. బ్యాడ్మింట్ అనేది అందరికీ తెలిసిన ఆట. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆట ఆడిఉంటారు. అందుకే ఇటు వైపు రావడం బెటర్ అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాప్సీ తెలిపారు.

    సినిమాల్లో కంటిన్యూ అవుతాను

    సినిమాల్లో కంటిన్యూ అవుతాను

    అలా అని నేను సినిమాకు దూరం అవుతానని అనుకోవద్దు. కొన్ని సంవత్సరాల క్రితం నేను వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ మొదలు పెట్టినపుడు నేను సినిమాలకు వదిలేస్తున్నట్లు భావించారు. ఇది ఒక సైడ్ బిజినెస్ మాతమ్రే. సినిమాల్లో ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాను అని తాప్సీ తెలిపారు.

    పూణె టీంతో

    పూణె టీంతో

    పూణె టీంతో నేను ఈ బ్యాడ్మింట్ లీగ్‌లోకి ఎంటరవుతున్నాను. మా టీం పేరు ‘పూణె సెవెన్ ఏసెస్'. అక్టోబర్ 8న ప్లేయర్స్ వేలం ఢిల్లీలో మొదలవుతుంది. బలమైన టీమ్‌ను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాం. మీకు తప్పకుండా బాడ్మింటన్ లీగ్ మంచి వినోదం పంచుతుందని భావిస్తున్నాను అన్నారు.

     ఆ ఇద్దరూ ఇష్టం

    ఆ ఇద్దరూ ఇష్టం

    మీ ఫేవరెట్ షట్లర్ ఎవరు? అనే ప్రశ్నకు తాప్సీ స్పందిస్తూ... ఇండియన్ ప్లేయర్ అంతా ఇష్టం. పివి సింధు, సైనా నెహ్వాల్. వాళ్ల ఆటను నేను ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూనే ఉంటాను అని తాప్సీ తెలిపారు.

    ఆటకు గ్లామర్ తోడైతే...

    ఆటకు గ్లామర్ తోడైతే...

    సినిమా యాక్టర్లు ఈ బ్యాడ్మింటన్ లీగ్‌తో అసోసియేట్ అవ్వడం ద్వారా రీచ్ పెరుగుతుంది. ఆటకు గ్లామర్ యాడ్ అవ్వడం వల్ల ప్రజల్లో ఈ లీగ్ మీద మరింత ఆసక్తి పెరుగుతుందని తాప్సీ తెలిపారు.

    English summary
    Taapsee has bought a team in the Premier Badminton League and she calls it her “biggest venture till date”. "I’m entering the league with the Pune team. It’d be called Pune Seven Aces." She said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X