ప్రైవేట్ పార్టులపైనే సౌత్ దర్శకుల గురి.. మాట మార్చిన తాప్సీ పన్ను!

బాలీవుడ్ నటి తాప్సీ పన్ను (Taapsee Pannu)తాజాగా తన హిందీ సినిమా అస్సీ (Assi) ప్రమోషన్స్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఓ పాడ్‌కాస్ట్‌లో తాప్సీ మాట్లాడుతూ.. సౌత్ సినిమాల్లో నాభి షాట్స్‌పై ఫోకస్ పెడతారని, బాలీవుడ్‌లో క్లీవేజ్ షోలపై ఎక్కువ దృష్టి ఉంటుందని వ్యాఖ్యానించింది. గ్లామర్ కోసం హీరోయిన్ల బాడీ పార్ట్స్‌పై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారని, దీనివల్ల టాలెంట్ కంటే అందాలకే ప్రాధాన్యం పెరుగుతోందని తాప్సీ పేర్కొంది. ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. యితే, ఈ వ్యాఖ్యలపై తాజాగా తాప్సీ క్లారిఫికేషన్ ఇచ్చి తన అసలు ఉద్దేశాన్ని వివరించింది.

ఇటీలవ తాప్సీ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. హిందీ సినిమాల్లో క్లీవేజ్‌పై ఎక్కువ ఫోకస్ పెడతారని, సౌత్ సినిమాల్లో ముఖ్యంగా మాస్ ఎంటర్‌టైనర్లలో నాభిపై ఎక్కువ ఫోకస్ చేశారని సంచనల వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, తన కెరీర్ ప్రారంభ దశలో కొన్ని పాటల షూటింగ్ సమయంలో ప్యాడెడ్ బ్రాలు ధరించమని, తనని పరోక్షంగా ఒత్తిడి తెచ్చారని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ విషయన్ని డైరెక్టర్స్ నేరుగా చెప్పకుండా అసిస్టెంట్ల ద్వారా చెప్పించేవారని, అయితే.. సెట్లో ఎక్కువగా పురుషులే ఉంటారు. వారు ఆ పరిస్థితిని చెప్పడం అసౌకర్యంగా మారేదని ఆమె తెలిపింది. 'ఇది ఎవరికీ చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే ఇబ్బంది దర్శకులకు కూడా ఉండేది'అని ఆమె వివరించింది.

Taapsee Pannu Clarifies South Directors Focus on Private Parts Remark Amid Controversy

తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీ నుంచి భారీగా విమర్శలు వెల్లువెత్తాయి. తాప్సీ తన కెరీర్ ప్రారంభంలో దక్షిణాది సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేసి అవకాశాలు పొందిందని, ఇప్పుడు అదే ఇండస్ట్రీపై విమర్శలు చేయడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఆమెను 'హిపోక్రిట్'అంటూ ట్రోల్ చేయగా, మరికొందరు అయితే.. తాప్సీకి సంబంధించిన పాత సినిమాల ఫోటోలు షేర్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇలా ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

తాప్సీ క్లారిఫికేషన్
ఇలా వివాదం తీవ్రం కావడంతో తాప్సీ స్పష్టీకరణ ఇచ్చింది.'నేను ఎప్పుడూ హిందీ సినిమాలు క్లీవేజ్‌పై, సౌత్ సినిమాలు నాభిపై ఫోకస్ చేస్తాయని విభజన చేయలేదు. అలా డిమార్కేట్ చేయలేదు'అని తెలిపింది. ఇక్కడ ప్రధాన సమస్య ఏ శరీర భాగాన్ని హైలైట్ చేస్తారనేది కాదు. అసలు సమస్య మహిళలను మగ దృష్టి (male gaze) కోణంలో చూపించే ఆబ్సెషన్. అది హిందీ అయినా, సౌత్ అయినా అన్ని ఇండస్ట్రీల్లో ఉంది. అయినా ప్రైవేట్ పార్టులపైనే సౌత్ దర్శకుల గురి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

తాప్సీ ఇంకా మాట్లాడుతూ.. ' ఇక దర్శకుడికి కూడా అసౌకర్యంగా ఉంది. ఎందుకంటే అతను నాకు ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. సెట్‌లో మహిళలు లేనప్పుడు మీరు దానిని ఎలా చెబుతారు? కాబట్టి దానిని రౌండ్అబౌట్ మార్గంలో చెప్పాల్సి వచ్చింది. ఆమె వ్యాన్‌లో తిరిగి వచ్చినప్పుడు, దర్శకుడు అది పనిచేస్తుందో లేదో తనిఖీ చేయాలి. కాబట్టి మొత్తం ప్రక్రియ కొంచెం ఇబ్బందికరంగా ఉంది.' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాప్సీ పన్ను చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయంగా మారాయి.

More from Filmibeat

Read more about: bollywood tapsee pannu Assi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X