తాప్సీ క్లీవేజ్ షో.. బ్లాక్ డ్రెస్‌లో బోల్డుగా.. ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

తాప్సీ.. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు తరచూ హాట్ టాపిక్ అవుతున్న పేరిది. సాఫ్ట్‌వేర్ రంగం నుంచి మోడలింగ్ వైపు వచ్చిన ఈమె.. 'ఝుమ్మందినాదం' సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఎన్నో తెలుగు చిత్రాల్లో కనిపించిన ఈ సుందరి.. తమిళంలోనూ మెరిసింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన సరైన హిట్‌ను తన ఖాతాలో వేసుకోకపోవడంతో బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది.

అక్కడ చేసిన తొలి సినిమాతోనే హిట్ సాధించి, ఆ తర్వాత అమితాబ్‌తో కలిసి 'పింక్' చిత్రంలో నటించింది. ఇది భారీ విజయం సాధించడంతో పాటు ఆమె మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో అప్పటి నుంచి హిందీలో బిజీ అయిపోయింది. వరుసగా సినిమాలు చేస్తూ దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె అక్షయ్ కుమార్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.

ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే.. మరోవైపు తాప్సీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు సామాజిక అంశాలపైనా ఆమె స్పందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల 'కబీర్ సింగ్' సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక, తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో తాప్సీ క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. దీనికి అరగంటలోనే లక్షన్నరకు పైగా లైకులు వచ్చాయి.

Taapsee Pannu cleavage show.. Fans Fidaa

అక్షయ్ కుమార్ హీరోగా శాటిలైట్ స్టేషన్ నేపథ్యంలో వస్తున్న చిత్రం 'మిషన్ మంగళ్'లో తాప్సీ కీలక పాత్ర పోషించింది. జగన్ శక్తి దీనిని తెరకెక్కించాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ రాకేష్ ధావన్ అనే సైంటిస్ట్ పాత్రలో నటించాడు. ఈ మిషన్‌లో భాగస్వామ్యం ఉన్న ఇతర ముఖ్యపాత్రల్లో విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, నిత్యా మీనన్, కీర్తి కుల్హరి నటించారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X