»   » బాయ్‌ఫ్రెండ్‌తో పట్టుబడిన తాప్సీ.. డేటింగ్ చేస్తున్న ప్రియుడు ఎవరంటే?

బాయ్‌ఫ్రెండ్‌తో పట్టుబడిన తాప్సీ.. డేటింగ్ చేస్తున్న ప్రియుడు ఎవరంటే?

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అందం, అభినయంతో కొంతకాలం హడావిడి చేసిన తాప్సీ పన్ను ప్రస్తుతం హిందీ చిత్రాలకే పరిమితమైంది. ఆనందో బ్రహ్మ చిత్రం తర్వాత మరే చిత్రంలోనూ కనిపించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకొంటున్నారు. గత కొద్దికాలంగా బోల్డ్ స్టేట్‌మెంట్లు ఇస్తున్న ఈ భామ తన బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైంది. తాప్సీ డేటింగ్ చేస్తున్నది ఎవరితోనంటే..

  డెన్మార్క్‌కు చెందిన

  డెన్మార్క్‌కు చెందిన

  డెన్మార్క్‌కు చెందిన మాథియాస్ బో అనే వ్యక్తితో తాప్సీ డేటింగ్ చేస్తున్నది. మాథియాస్ బో ఒలంపిక్‌లో సిల్వర్ మెడల్‌ను గెలుచుకొనన బాడ్మింటన్ క్రీడాకారుడు కావడం విశేషం. గత కొద్ది సంవత్సరాలుగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. అయితే తన బాయ్‌ఫ్రెండ్ వివరాలను మీడియాకు చెప్పడానికి నిరాకరిస్తుంటారు.

  లేటేస్ట్ న్యూస్: యాక్ష‌న్ కింగ్ అర్జున్ 150వ సినిమాగా కురుక్షేత్రం.. మరోసారి మ్యాజిక్..

  మాథియాస్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నా

  మాథియాస్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నా

  ఇటీవల జాతీయ ఆంగ్ల వెబ్‌సైట్‌తో తాప్సీ మాట్లాడుతూ.. నేను ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. అది ఎవరన్నది నేను ఇప్పుడే చెప్పలేను. మాథియాసా? మరొకరా అనేది ఇప్పడే వెల్లడించాను. నా వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలోకి ప్రవేశించే వ్యక్తి ఎవరన్నది సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తాను అని అన్నారు.

  లేటేస్ట్ న్యూస్: నన్నుదోచుకుందువ‌టే లిరికల్ వీడియోకు మంచి రెస్పాన్స్.. సుధీర్‌బాబు హిట్టు ఖాయమా?

  పచ్చని డ్రెస్‌లో తాప్సీ అందంగా

  పచ్చని డ్రెస్‌లో తాప్సీ అందంగా

  ఇలాంటి పరిస్థితుల్లో తాప్సీ తన బాయ్‌ఫ్రెండ్‌ మాథియాస్‌తో చెట్టాపట్టాలేసుకొని మీడియాకు దొరికిపోయింది. పసుపు పచ్చని మిడ్డీలో తాప్సీ చాలా అందంగా కనిపించింది. మాథియాస్ చాలా సింపుల్‌గా వైట్ టీషర్టు, రెడ్ షార్టులో కనిపించారు. ఫోటోగ్రాఫర్లు కెమెరాలను క్లిక్ మనిపిస్తుండగా గమనించిన వీరు నవ్వుకుంటూ తప్పించుకొనే ప్రయత్నం చేశారు.

  అభిషేక్ బచ్చన్‌తో తాప్సీ

  అభిషేక్ బచ్చన్‌తో తాప్సీ

  ఇదిలా ఉండగా, సినిమాల విషయానికి వస్తే తాప్సీ ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ రూపొందిస్తున్న మన్మార్‌జియాన్ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్; వికీ కౌశల్ నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.

  English summary
  Bollywood actress Taapsee Pannu in a relationship with Denmark's Olympic silver medallist badminton player Mathias Boe. Recently, Tapsee, Mathias clicked together on a lunch date. While Taapsee looked stunning in a yellow ochre Birdwalk midi dress, Mathias kept it simple in a white tee paired with red shorts.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more