ఇంకా ఆ మత్తులోంచి రాలేకపోతోన్నట్టుంది.. ఫోటోలతో తాప్సీ రచ్చ
తాప్సీ పన్ను గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. ఏదో ఒక సెటైర్ వేయడం లేదా హాట్ ఫోటోలు షేర్ చేయడం వంటి వాటితో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. సుశాంత్ సింగ్ కేసు, డ్రగ్స్ కేసు, రియా చక్రవర్తి విషయంలో తాప్సీ పన్ను చేసిన కామెంట్లో ఓ రేంజ్‌లో వైరల్అయ్యాయి. ఇక కంగనా రనౌత్ తాప్సీ పన్ను మధ్య జరిగిన పరోక్ష మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం అవన్నీ పక్కకి జరిగిపోయాయి.
ఈ మధ్య తాప్సీ మాల్దీవుల్లో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఓ ఐదారు రోజుల వెకేషన్ కోసం తాప్సీ పన్ను తన సోదరి, స్నేహితురాలిని మాల్దీవులకు తీసుకెళ్లింది. ఇన్ని నెలల ఫ్రస్ట్రేషన్‌ను మాల్దీవుల్లో తీర్చేసుకుంది. బీచుల్లో హాయిగా సేదతీరుతూ అన్నింటిని మరిచిపోయి హాయిగా ఎంజాయ్ చేసింది. తన సోదరి షగున్ పన్నుతో కలిసి బాగానేరచ్చ చేసింది. అయితే ఈ వెకేషన్‌లో తాప్సీ లవర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది.

ఇక మాల్దీవుల్లో తన అందాలతో మంట పెట్టిన ఫోటోలను కూడా షేర్ చేసింది. బికినీ ఫోటోలతో తాప్సీ చేసిన రచ్చకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అయితే తాప్సీ మాత్రం ఇంకా ఆ మత్తులోంచి బయటకు రానట్టు కనిపిస్తోంది. ముంబైకి తిరిగి వచ్చి షూటింగ్‌లో పాల్గొన్నా కూడా ఇంకా మాల్దీవుల ఆలోచనలు వదిలిపెట్టడం లేదని తెలుస్తోంది. కనీసం అక్కడ ఉన్నట్టు నన్ను ఊహించుకోనివ్వడం లేదంటూ అదిరిపోయే ఫోటోను షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











