ఇన్నర్ వేర్ యాడ్ లో తాప్సీ... పెళ్లయ్యాక ఇలా అవసరమా ? అంటూ నెటిజన్లు ఫైర్

ప్రస్తుతం హిందీ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్న తాప్సి తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన వీడియోతో అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆమె ఇన్నర్ వేర్ కు సంబంధించిన యాడ్ లో కనిపించడంతో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ట్రోల్లింగ్ కు కారణం ఏంటి అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

తాప్సి ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఆ తరువాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుండగానే తాప్సీకి బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో అక్కడే సెటిల్ అయిపోయింది.

taapsee pannu getting trolled for her inner wear advertisement after marriage

ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటిస్తోంది. ముఖ్యంగా ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది తాప్సీ. ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తాప్సీ కెరీర్ స్టార్ హీరోయిన్ గా కీలక మలుపు తిరిగింది.

చాలా వరకు తాప్సీ సినిమాలు ప్లాప్ అయినప్పటికీ, కొన్ని సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. చివరగా తాప్సీ డంకీ సినిమాలో నటించింది.

షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ గా కనిపించింది. ఈ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. త్వరలోనే హసీన్ దిల్రూబా పార్ట్ 2తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ మూవీ త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది.

taapsee pannu getting trolled for her inner wear advertisement after marriage

ఈ నేపథ్యంలోనే తాప్సీ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో లో దుస్తులు ధరించిన వీడియోను పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. అందులో ఆమె ఏకంగా బట్టలు విప్పుతూ ఇన్నర్ వేర్ ను హైలెట్ చేస్తూ కన్పించడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.

తాప్సీ లండన్‌కు చెందిన లోదుస్తుల బ్రాండ్ అయిన స్టెల్లా మెక్‌కార్ట్నీ కోసం ఈ ప్రకటనలో నటించింది. అయితే పెళ్లయ్యాక కూడా ఇలాంటి పనేంటి అంటూ మండిపడుతున్నారు అభిమానులు. ఆమె ఫోటోలు వీడియోలు చూసి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలాంటి ట్రోల్స్ ను ఆమె ఏమాత్రం పట్టించుకోదు.

యాడ్ ఏజెన్సీ ఎక్కువ పారితోషికం ఇవ్వడం వల్లే పెళ్లయ్యాక కూడా ఇలాంటి యాడ్ లో నటించింది అంటున్నారు. అభిమానులు మాత్రం తాప్సిని ఆ లుక్ లో చూసి మురిసిపోతున్నారు.

36 ఏళ్ల తాప్సీ ఇటీవల తన ప్రియుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారిడు మథియాస్ పోను వివాహం చేసుకుంది. అయితే ఆమె వివాహ వేడుక చాలా ప్రైవేట్ గా జరిగింది. సినిమా ఇండస్ట్రి నుంచి ఎవ్వరినీ ఆహ్వానించలేదు తాప్సీ.

More from Filmibeat

Read more about: taapsee తాప్సీ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X