టాలీవుడ్‌లో హీరోయిన్లను అలా పాడు చేస్తున్నారు... ఇతర ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి లేదు.. తాప్సీ

బాలీవుడ్‌ తారగా తాప్సీ పొన్ను ముద్ర వేసుకొన్నప్పటికీ.. టాలీవుడ్‌తోనే ఆమె గుర్తింపు పొందింది. ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పలు విభిన్నమైన చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం హిందీ చిత్రపరిశ్రమలో రాణిస్తున్నది. అలాగే ఆమె మనస్తత్వం ముక్కుసూటిగా ఉంటుందనేది పలు సందర్భాల్లో వ్యక్తమైంది. ఏదైనా అభిప్రాయాన్ని చెప్పాల్సి వస్తే సూటిగా చెప్పడం కనిపిస్తుంది. గతంలో రాఘవేంద్రరావుపై హాట్ కామెంట్ చేసిన తాప్సీ తాజాగా తెలుగు సినీ పరిశ్రమ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. గతంలోని తాప్సీ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంటర్వ్యూ వివరాలు ఇవే..

టాలీవుడ్‌లో అదే గొప్పదనమని

టాలీవుడ్‌లో అదే గొప్పదనమని

తెలుగు సినిమా గురించి తాప్సీ మాట్లాడుతూ.. టాలీవుడ్ పరిశ్రమ నిజంగా పాడుచేస్తుందనేది నా అభిప్రాయం. తెలుగు సినిమా పరిశ్రమలో అదే గొప్పతనం. ఎందుకంటే ఇండస్ట్రీ వర్గాలు హీరోయిన్‌ను మహారాణిలా చూసుకొంటారు. హీరోయిన్ వ్యాన్ దిగితే చాలు ప్రతీ ఒక్కరు వినయంగా నిలుచుంటారు. మనం అక్కడి నుంచి వెళ్లే వరకు ఎవరూ కూర్చొరు. అలాంటి గౌరవాన్ని హీరోయిన్లకు ఇస్తారు అని తాప్సీ అన్నారు.

అలా గర్వంగా ఫీలవుతారు

అలా గర్వంగా ఫీలవుతారు

టాలీవుడ్‌లో ఇచ్చే గౌరవంతో హీరోయిన్లు తాము గొప్ప అనే ఫీలింగ్‌కు లోనవుతారు. అందాల దేవతలమనే భ్రమలో పడిపోతారు. కొందరైతే దానిని తలకు ఎక్కించుకొని గర్వంగా ఫీల్ అవుతుంటారు. యూనిట్ ఇచ్చే రాయల్ ట్రీట్‌మెంట్‌తో మన అస్థిత్వాలను మరిచిపోయే ప్రమాదానికి లోనవుతాం అని తాప్పీ తన అనుభవాలను అభిప్రాయంగా చెప్పారు.

టాలీవుడ్‌ను మిస్ అవుతున్నా

టాలీవుడ్‌ను మిస్ అవుతున్నా

బాలీవుడ్‌లో అలాంటి పరిస్థితి కనిపించదు. తెలుగు సినిమా పరిశ్రమలో దక్కే గౌరవాన్ని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ కలుగుతుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోయిన్లను రాణిలా చూసుకొంటారు. పరిశ్రమలో మహిళలకు ఇచ్చే గౌరవం మిగితా ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించదు. అందుకే నాకు తెలుగు సినీ పరిశ్రమ అంటే నాకు అత్యంత గౌరవం అని తాప్సీ పేర్కొన్నది.

తాప్సీ గేమ్ ఓవర్ చిత్రంలో

తాప్సీ గేమ్ ఓవర్ చిత్రంలో

తాప్సీ కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం గేమ్ ఓవర్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నది. గతంలో ఆమె నటించిన ఆనందో బ్రహ్మ చిత్రం మంచి విజయాన్ని అందుకొన్నది. ఆమె తెలుగులో నీవెవరో అనే చిత్రంలో చివరిసారిగా కనిపించింది. 2015లో ఆమె బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X