మీ అబ్బాయితో డేటింగ్ వెళ్తా.. పర్మిషన్ ఇస్తారా.. తాప్సీ.. ఎవరితోనంటే..!
బాలీవుడ్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ కుమారుడు తైమూర్ ఆలీ ఖాన్‌కు దాదాపు చిన్నసైజు హీరోకు ఉన్న పాపులారిటీ మీడియాలో ఉందంటే అతిశయోక్తి కాదు. తైమూరు మీడియా ఫోటోగ్రాఫర్లు వెంటపడటం కరీనా దంపతులకు ఎక్కడలేని సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. తైమూరును పోలి ఉన్న బొమ్మలు కూడా మార్కెట్‌లోకి వచ్చాయంటే ఆ పిల్లాడికి ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా తైమూరు అభిమానుల జాబితాలో తాప్సీ కూడా చేరిపోయింది. కరీనాను ఇటీవల ఓ ఆసక్తికరమైన కోరిక కోరింది. అదేమిటంటే..

బద్లా చిత్రంలో అమితాబ్‌తో
అందాల భామ తాప్సీ ప్రస్తుతం అమితాబ్ బచ్చన్‌తో కలిసి సుజయ్ ఘోష్ దర్శకత్వంలో బద్లా అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం మార్చి 8న రిలీజ్ కానుండటంతో సినిమా ప్రమోషన్‌లో బిజీగా మారిపోయింది. ఈ సందర్భంగా మీరు ఎవరితో డేటింగ్‌కు వెళ్లాలనుకొంటున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు తాప్సీ సమాధానం ఇచ్చింది.

కరీనా కపూర్ పర్మిషన్ ఇస్తే
బాలీవుడ్‌లో ఎవరితోనైనా డేటింగ్‌కు వెళ్లాల్సి వస్తే ముందుగా కరీనా కపూర్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నేను డేటింగ్ వెళ్లాల్సి వస్తే అది సైఫ్ ఆలీ ఖాన్‌తో కాకుండా వాళ్ల అబ్బాయి తైమూర్ ఖాన్‌తో డేటింగ్‌కు వెళ్తాను అని చెప్పడంతో మీడియా సమావేశంలోని ప్రతీ ఒక్కరు బిగ్గరగా నవ్వడం జరిగింది.

తెలివిగా తప్పించుకొన్న తాప్సీ పొన్ను
బాలీవుడ్ మీడియా సమావేశాల్లో తాప్సీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని అందరికి తెలిసిందే. డేటింగ్ విషయంపై అడిగిన ప్రశ్నకు ఇలా తైమూరును వాడేసుకొన్నది. చాలా తెలివిగా ఆ ప్రశ్నను దాటవేయడం తాప్సీ వాక్చాతుర్యానికి అద్దంపట్టిందనే అభిప్రాయం వ్యక్తమైంది.

మార్చి 8న బద్లా మూవీ విడుదల
పింక్ చిత్రం తర్వాత అమితాబ్ బచ్చన్‌తో కలిసి తాప్సీ బద్లా చిత్రంలో మరోసారి నటిస్తున్నది. ఈ చిత్రాన్ని షారుక్ ఖాన్ స్వంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న రిలీజ్ కాబోతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లకు మంచి స్పందన కనిపించింది.


Click it and Unblock the Notifications











