ప్రియుడితో తాప్సీ పన్ను రచ్చ రచ్చ.. మాల్దీవుల ప్రకృతి ఒడిలో ఏకాంతంగా
లాక్‌డౌన్ తర్వాత అందాల భామ తాప్సీ పన్ను హంగామా ఓ రేంజ్‌లో కొనసాగుతున్నది. గత ఆర్నెళ్లుగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ ఇప్పుడు ప్రియుడితో కలిసి విహారయాత్ర చేపట్టింది. లాక్‌డౌన్‌లో పడిన టెన్షన్‌ను తగ్గించుకొనేందుకు ప్రియుడితో కలిసి ఈ భామ మాల్దీవుల్లో సేద తీరుతున్నది. తాప్సీ పన్ను రచ్చ ఎలా ఉందో మేరే చూడండి..

లాక్‌డౌన్ తర్వాత ప్రియుడితో కలిసి
లాక్‌డౌన్ తర్వాత తొలిసారి జైపూర్‌లో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న షూటింగులో పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా తన సోదరి, బాయ్‌ఫ్రెండ్ మాతియాస్ బో తోపాటు తాప్సీ మాల్దీవులకు వెళ్లారు. అక్కడ వేకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు తన ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి.

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రచ్చ
తాప్సీ తన ప్రియుడు మాతియాస్‌తో కలిసితో స్కూబా డౌవ్ చేస్తూ దిగిన ఫోటోలు, డ్యాన్సులు చేస్తూ కెమెరాకు ఫోజిచ్చిన చిత్రాలను తమ ఇన్స్‌టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఉత్సాహం ఉరకలేసి విధంగా వెకేషన్ సాగుతున్నది అని తాప్సీ చెప్పారు.

ప్రేమ, ఆనంద క్షణాలను అనుభవిస్తున్నా
లాక్‌డౌన్ తర్వాత ప్రేమ, ఆనందం కలిసి క్షణాలను అనుభవిస్తున్నా. కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తర్వాత మళ్లీ ఉత్సాహం, ఎనర్జీని సొంతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నా. లైట్, కెమెరా, యాక్షన్ మాటలు మళ్లీ నా చెవులకు చేరడంతో మరింత జోష్ పెరిగింది అని తాప్సీ తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.

హసీనా దిల్‌రుబా షూటింగులో
మాల్దీవుల నుంచి వచ్చిన తర్వాత తాప్సీ షూటింగులతో బిజీ కానున్నది. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాతగా రూపొందించే హసీనా దిల్‌రుబా చిత్ర షూటింగులో పాల్గొంటారు. ప్రేమకథా నేపథ్యంతో మర్డర్ మిస్టరీగా ఈ చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రంపై తాప్సీ భారీగా ఆశలు పెట్టుకొన్నారు.
Recommended Video

లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా
తాప్సీ నటించే హసీనా దిల్‌రుబా చిత్రానికి హసీతో ఫసీ ఫేమ్ వినిల్ మ్యాథ్యూస్ దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా షూట్ సెప్టెంబర్‌లో మొదలుపెట్టాలని భావించారు. అయితే లాక్‌డౌన్ కారణంగా షూట్ వాయిదా పడింది. లాక్‌డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











