Taapsee Pannu: అతి చిన్న స్కర్ట్ లో షాక్ ఇచ్చిన తాప్సి.. వామ్మో ఇలా ఉందేంటి..?
సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను మొదట తెలుగు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఝుమ్మందినాదం సినిమాతో ఆమె హీరోయిన్ గా టాలీవుడ్ వెండితెరకు పరిచయం అయింది. అయితే అమ్మడు ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. ఇక మెల్లగా బాలీవుడ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయితే ఈ బ్యూటీకి అతి తక్కువ కాలంలోనే మంచి అవకాశాలు వచ్చాయి. ఇక గ్లామర్ విషయంలో అయితే డోస్ అంతకంతకూ పెంచుతూనే ఉంది. రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా ఒక హాట్ లుక్ తో షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

మొదట సక్సెస్ రాకపోయినప్పటికి
మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న తర్వాత తాప్సి కొన్నాళ్ళు యాక్టింగ్ లో కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. ఇక ఆమె ఆడిషన్స్ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా చాలా మంచి అవకాశాలు వచ్చాయి. ఝుమ్మందినాదం సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత ఏడాదిలో ఒకేసారి ఏడు సినిమాలు చేసింది. మిస్టర్ పర్ఫెక్ట్ తప్పితే మిగతా సినిమాలేవీ కూడా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు.

బాలీవుడ్ లో బిజీగా..
ప్రతి ఏడాది కూడా తాప్సీ పన్నుకి నాలుగు లేదా ఐదు సినిమాల్లో అవకశాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆ సినిమాలేవీ కూడా అమ్మడికి అంతగా సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఇక తెలుగు తమిళ్ మలయాళం లో 2014 వరకు కాస్త బిజీ గా కనిపించిన తాప్సీ 2014 నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అక్షయ్ కుమార్ బేబీ సినిమాలో ఒక సపోర్టింగ్ రోల్ తో మెప్పించడంతో ఆ తర్వాత అమ్మడికి పింక్ సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది.

మొదటిసారి బికినీలో..
ఇక జుడ్వా 2 సినిమాలో తాప్సీ మొదటిసారి హాట్ బికినీలో కనిపించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ లో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అవసరమైన సినిమాలకు గ్లామర్ ప్రజెంటేషన్ లో తాప్సీ కాస్త లిమిట్స్ దాటింది అనే కామెంట్స్ కూడా అందుకుంది. ఇక తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ నటిగా అయితే ఒక మంచి గుర్తింపును అందుకుంటోంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు కూడా చేసుకుంటూ వ
Recommended Video

బ్లాక్ స్కట్ లో హాట్ లుక్
ఇక ఇటీవల కాలంలో తాప్సీ వరుసగా హిందీ సినిమాలతో బిజీగా మారుతుంది సౌత్ సినిమాలకు కాస్త దూరం పెట్టిందనే చెప్పాలి. అయితే ఏక్కడ సినిమాలు చేస్తున్న కూడా తాప్సీ గ్లామర్ విషయంలో మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవల మెరుస్తున్న ఒక బ్లాక్ స్కట్ లో అమ్మడు ఎవరు ఊహించని విధంగా దర్శనమిచ్చింది. సడన్ గా చూస్తే బికినీ ఏమైనా వేసుకుందేమో అని అనిపిస్తోంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆమె హెయిర్ స్టైల్ కూడా చాలా బిన్నంగా ఉన్నట్లు అనిపిస్తోందని అంటున్నారు. కొందరైతే వామ్మో తాప్సి ఇలా మారిపోయిందేటని కూడా అంటున్నారు.


Click it and Unblock the Notifications











