Taapsee Pannu : అయ్య బాబోయ్ తాప్సీ బోల్డ్ షో .. బ్లాక్ డ్రెస్‌లో అంతకు మించి అనేలా!
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝమ్మందినాదం సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యారు సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను. దర్శకేంద్రుడు పూలు, పండ్లు బాగా వాడటంతో తొలి చిత్రంతోనే కుర్రకారుకు గిలిగింతలు పెట్టారు తాప్సీ. క్యూట్ స్మైల్, మెస్మరైజింగ్ లుక్, లే లేత అందాలతో డెబ్యూ మూవీతోనే బోల్డెంత పాపులారిటీ దక్కించుకున్నారు. ఆ వెంటనే ప్రభాస్ , వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించే ఛాన్సులు కొట్టేసింది ఈ ఢిల్లీ బ్యూటీ.
తెలుగులో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న తాప్సీ పన్ను ఆ వెంటనే తన మకాంను హైదరాబాద్ నుంచి చెన్నైకి షిఫ్ట్ చేసింది. అక్కడ కూడా మంచి అవకాశాలను పట్టేసిన ఈ ముద్దుగుమ్మకు కాలం కలిసిరాలేదు. సినీ నటి కావడానికి ముందు భరతనాట్యం, స్క్వాష్ క్రీడలలో రాణించారు తాప్సీ. కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గానూ పనిచేసి అనుకోకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టారట తాప్సీ. అలా తెలుగువారిని పలకరించి చెన్నై మీదుగా ముంబైలో పాదం మోపారు.

చష్మే బద్దూర్‌తో హిందీలో తన అదృష్టం పరీక్షించుకున్నారు. అక్కడా పడుతూ లేస్తూ అన్నట్లుగానే ఆమె కెరీర్ సాగుతోంది. మొన్నామధ్య కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సరసన నటించిన డుంకీతో హిట్ కొట్టారు తాప్సీ. ప్రస్తుతం ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్ట్‌లున్నాయి. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌తో సుదీర్ఘకాలంగా డేటింగ్‌లో తాప్సీ.. ఈ ఏడాది మార్చిలో అతనితో పెళ్లిపీటలెక్కింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్‌లోని ప్రఖ్యాత ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో వీరిద్దరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.
కానీ నేటి వరకు తాప్సీ పెళ్లి ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదంటే ఆమె ఎంతంటి గోప్యత పాటిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. మథియాస్ గత కొంతకాలంగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్- చిరాగ్‌లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాప్సీకి అందంతో పాటు ముక్కుసూటితనం, కాస్త కోపం కూడా ఎక్కువే. ఏ విషయంపై అయినా నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఆమె వివాదంలో ఇరుక్కుంటూ ఉంటారు.
కొద్దిరోజుల క్రితం అక్షయ్ కుమార్‌తో నటించిన ఖేల్ ఖేల్ మే .. ఆడియో రిలీజ్ కార్యక్రమం సందర్భంగా తాప్సీ ఓ వివాదంలో చిక్కుకున్నారు. వేదికపైకి వచ్చిన అనన్య ద్వివేది అనే ఓ యువతి తాప్సీ వద్దకు వెళ్లి సెల్ఫీ కోరగా.. ఆమె నిరాకరించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను ఏకీ పారేశారు. ఇది సద్దుమణిగిందో లేదో ఓ జాతీయ ఛానెల్ నిర్వహించిన పోడ్‌కాస్ట్‌లో ఫోటోగ్రాఫర్లపై నోరుపారేసుకుంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే తాప్సీ పన్ను తరచుగా తన వ్యక్తిగత , సినిమా సంగతులను పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారులో సెగలు రేపుతుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











