పెళ్లికి సిద్దమైన టాలీవుడ్ హీరోయిన్.. ముహూర్తం కూడా ఖరారు.. అధికారిక ప్రకటన కూడా?
సినిమాల్లో కాస్త అవకాశాలు తగ్గగానే పెళ్లి చేసుకుంటున్నారు హీరోయిన్లు. అయితే కొందరు మాత్రం కెరీర్ లో మంచి ఫామ్లో ఉన్నప్పటికీ పెళ్లి చేసుకుని కెరీర్ కొనసాగించడానికి చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు అదే బాటలో నడుస్తూ ఉండగా మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. ఆమె మరెవరో కాదు తాప్సీ. ఆమె ఎవరిని వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది? ఎవరి ప్రేమలో ఉంది? అనే వివరాల్లోకి వెళితే

పెళ్ళికి సిద్ధం
తెలుగులో గుండెఝల్లుమంది అనే సినిమా ద్వారా సినిమా రంగానికి పరిచయమయింది ఢిల్లీ భామ తాప్సీ. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్థిరపడే ప్రయత్నాలు చేస్తున్న ఈ భామ ఇప్పుడు పెళ్ళికి సిద్ధం అయిందని అంటున్నారు.

లేడీ ఓరియెంటెడ్
తెలుగులో సినిమాలు చేస్తూ వరుస అవకాశాలు దక్కించుకున్న ఆమె తమిళ్ లో కూడా బిజీగా హీరోయిన్ గా మారింది. ఇక ఎలాగూ ఉత్తరాది భామ కావడంతో బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో అటు చెక్కేసింది. అక్కడ కూడా తక్కువ సమయంలోనే స్టార్ సినిమాలలో భాగం అయింది. బాలీవుడ్ లో ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారింది.

పెళ్లి చేసుకోవాలి అని
ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ. కొంతకాలంగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథియాస్ బోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు చెబుతున్నారు. తాజాగా తాప్సీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లి చేసుకోవాలి అని భావించి ఇరు వర్గాల కుటుంబసభ్యుల దృష్టికి తీసుకు వెళ్లారట.

అఫీషియల్ అనౌన్స్‌మెంట్
అయితే వారు దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు పెళ్లి ముహూర్తాన్ని కూడా నిర్ణయించినట్లు బాలీవుడ్ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందని అంటున్నారు. తాప్సీ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. మంచి కథలు ఎంపిక చేసుకుంటూ.. మంచి సినిమాలతో..తన మార్కు నటనతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మిషన్ ఇంపాజిబుల్
ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయిన తాప్సీ చాలా కాలం తర్వాత తెలుగులో తెరపై మెరవబోతుంది. బాలీవుడ్ లో బాగా బిజీ అయిపోయిన తాప్సీ పన్ను,చాలా కాలం తర్వాత తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ అనే సినిమా చేస్తోంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం స్వరూప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











