కారణం లేకుండానే అలా వదిలేశాడు.. ఇప్పుడు అతడితో బాగుంది.. తాప్సీ

అందం, అభినయంతో మెప్పిస్తున్న హీరోయిన్ తాప్సీ పన్ను ఏది మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడుతుంటుంది. అందుకే ఎప్పుడూ వార్తల్లో ఉంటారు ఆమె. తాజాగా ఒలంపిక్ సిల్వర్ మెడల్ విజేత, బాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బోతో డేటింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ తన రిలేషన్ షిప్స్, బాయ్ ఫ్రెండ్స్, బ్రేకప్స్ గురించి ఓపెన్ అయ్యారు. తన వ్యక్తిగత జీవితంలోని చోటు చేసుకొన్న విషయాలపై ఏం చెప్పారంటే..

తొమ్మిదో తరగతిలోనే అఫైర్

తొమ్మిదో తరగతిలోనే అఫైర్

నా జీవితంలో నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మొదటి రిలేషన్‌షిప్ జరిగింది. ఆ రిలేషన్‌షిప్‌ను తలుచుకొంటే చాలా గమ్మత్తుగా, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ అబ్బాయి 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయని నా అఫైర్‌కు గుడ్‌బై చెప్పారు అని తాప్సీ తన మొదటి ప్రేమ కథను వివరించింది.

 కారణం లేకుండానే నాతో బ్రేకప్

కారణం లేకుండానే నాతో బ్రేకప్

ఆ తర్వాత మరో వ్యక్తితో ప్రేమలో పడ్డాను. అతడు ఎవరో నాకు తెలియదు. కానీ ఫోన్‌లోనే మాట్లాడే దానిని. అతడితో జరిగిన బ్రేకప్‌తో చాలా కష్టాలు పడ్డాను. నాకు బాగా గుర్తుంది. ఆ సమయంలో మొబైల్ ఫోన్లు లేవు. నా ఇంటి వెనుక ఉండే ఫోన్ బూత్‌కు వెళ్లి అతడికి కాల్ చేసే వాడిని. ఉన్నట్టుండి కారణం లేకుండానే నన్ను వదిలించుకోవాలని చూశాడు. అప్పడు నేను ఫోన్‌లోనే విపరీతంగా ఏడ్చాను అని తాప్సీ వెల్లడించింది.

అతడే జీవిత భాగస్వామి అని

అతడే జీవిత భాగస్వామి అని

అలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా జరిగాయి. చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. నేనెప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉన్నా చాలా డీప్‌గా లవ్‌లోకి వెళ్లిపోతాను. అతడినే నా జీవితపు భాగస్వామి అనుకొంటాను. ఒకవేళ అతడితో నాకు కుదరకపోతే.. పెద్దగా బాధపడను. అతడు నా జీవితం మొత్తంలో ఉండే వ్యక్తి కాదని అనుకొని నాకు నేను ఊరట చెందుతాను అని తాప్సీ వెల్లడించింది.

 బాడ్మింటన్ క్రీడాకారుడితో డేటింగ్

బాడ్మింటన్ క్రీడాకారుడితో డేటింగ్

ప్రస్తుతం ఒలంపిక్ సిల్వర్ మెడల్ విజేత మాథియాస్ బో అనే బాడ్మింటన్ క్రీడాకారుడితో డేటింగ్ చేస్తున్నది నిజమే. కానీ ఇంకా అతడు ఏమి చెప్పలేదు. మాథియాస్ ఒకే చేస్తే నా బంధం ముందుకెళ్తున్నది. ప్రస్తుతం నా వ్యక్తిగత జీవితం అద్భుతంగా సాగుతున్నది అని తాప్సీ పేర్కొన్నారు.

అందుకే నేను చెప్పను

అందుకే నేను చెప్పను

సాధారణంగా ఇలాంటి విషయాలను నేను మీడియాతో మాట్లాడను. ఎందుకంటే నా ప్రొఫెషనల్ లైఫ్‌ను పక్కన పెట్టి నా వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడుస్తారు. అది నాకు రుచించదు. అందుకే పెద్దగా నా రిలేషన్‌షిప్స్ గురించి పెద్దగా పట్టించుకోను. నేను ఇప్పుడు ఎవరితోనైతే రిలేషన్‌లో ఉన్నానో.. అందుకు గర్వంగా అనిపిస్తుంది.

నా అలాంటి భర్త కావాలి

నా అలాంటి భర్త కావాలి

నా జాతక నక్షత్రం లియో. ఆగస్టు 1వ తేదీన పుట్టాను. అదే నెలలో పుడితే నాకు మంచి కాంబినేషన్ అవుతుంది. నా జీవితంలో, ప్రొఫెషనల్ లైఫ్‌లో నేనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. కాబట్టి నా కంట్రోల్ లేని వ్యక్తి నాకు దొరికితే.. అతడిని నా కంట్రోల్ తెచ్చుకోవడం చాలా ఫన్ గా ఉంటుంది. అలాంటి వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాను అని తాప్సీ చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X