twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తాప్పీని తప్పించారు... ఇది అన్యాయం అంటూ మీడియా ముందుకు!

    |

    హీరోయిన్ తాప్సీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత విభిన్నమైన సినిమాలు చేస్తూ నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. గతేడాది ఆమె నటించి ముల్క్, మన్మర్జియాన్, సూర్మా చిత్రాలతో పెర్ఫార్మెన్స్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

    ఈ క్రమంలోనే తాప్సీకి ఇటీవల 1978 నాటి హిందీ క్లాకిస్ మూవీ 'పతీ పత్ని ఔర్ ఓ' రీమేక్‌లో నటించే అవకాశం దక్కింది. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆమె వెంటనే దానికి ఓకే చెప్పింది. గత నవంబర్లోనే ఈ మూవీకి కమిట్మెంట్ ఇచ్చింది. అయితే ఉన్నట్టుండి ఈ ప్రాజెక్ట్ నుంచి తనను తప్పించి వేరొకరిని తీసుకోవడంతో తాప్సీ తీవ్ర మనోవేదనకు గురైంది.

    మీడియా ముందు గోడు వెల్లబోసుకున్న తాప్సీ

    మీడియా ముందు గోడు వెల్లబోసుకున్న తాప్సీ

    ఈ విషయంలో తాప్సీ మీడియా ముందుకు వచ్చి గోడు వెల్లబోసుకున్నారు. ‘నాకు నవంబర్లో స్టోరీ చెప్పారు. ఆ సమయంలో జునో, అభయ్(నిర్మాతలు) అక్కడే ఉన్నారు. నాకు కథ నచ్చడంతో చేయానికి ఓకే చెప్పాను. తర్వరగా నా కమిట్మెంట్స్ పూర్తి చేసుకోవవాలని చెప్పడంతో అలాగే చేశాను. ఉన్నట్టుండి ఇపుడు నన్ను తప్పించారు' అని తెలిపారు.

    నాకు సరైన కారణం కూడా చెప్పడం లేదు

    నాకు సరైన కారణం కూడా చెప్పడం లేదు

    నన్ను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నట్లు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. దర్శకుడు ముదాసర్ అలీని అడిగితే ఆయన నుంచి సరైన సమాధానం లేదు. నిర్మాతలను సంప్రదిస్తే ప్రాపర్ రీజన్ చెప్పడం లేదు. చాలా దారుణంగా మాట్లాడారు. అంతా ఓకే అయిన తర్వాత నన్ను తప్పించడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను... అని తాప్సీ మీడియా ముఖంగా ప్రశ్నించారు.

    'నా బాడీలో ఏ పార్ట్ అంటే ఇష్టం'.. నాకైతే అదే.. ఆకతాయికి తాప్సి దిమ్మతిరిగేలా!'నా బాడీలో ఏ పార్ట్ అంటే ఇష్టం'.. నాకైతే అదే.. ఆకతాయికి తాప్సి దిమ్మతిరిగేలా!

    చాలా నష్టపోయాను

    చాలా నష్టపోయాను

    ఈ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి ఇతర సినిమాల ఆఫర్స్ వస్తే వదులుకున్నాను. ఈ దర్శక నిర్మాతల వల్ల నేను నష్టపోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ యాక్టర్‌కు రాకూడదను అంటూ తాప్సీ తనలోని బాధను వెల్లగక్కింది.

    కారణం అదేనా?

    కారణం అదేనా?

    రెమ్యూనరేషన్ విషయంలో కొన్ని బేరసాలు జరిగిన మాట నిజమే కానీ.. ఈ విషయంలో పూర్తి స్థాయి చర్చలు జరుగలేదని తాప్సీ చెబుతోంది. బహుషా నిర్మాతలు ఈ కారణంతోనే ఆమె వద్దనుకున్నారా? లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.

    English summary
    Actor Taapsee Pannu says she is disheartened after being dropped from the remake of old Hindi classic movie, Pati, Patni Aur Woh. In an interview to Mumbai Mirror, Taapsee said she was narrated the script in November and agreed to the film, she has been dropped from the film earlier this week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X