కత్తుల దూసుకొన్న కంగన రనౌత్, తాప్సీ రాజీ.. ఒకరికొకరు ప్రశంసల వర్షం
బాలీవుడ్ హీరోయిన్లు కంగన రనౌత్, తాప్సీ పన్ను మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విభేదాలు నెలకొన్నాయి. గత కొద్దికాలంగా వారిద్దరు సోషల్ మీడియా వేదికగా కత్తులు దూసుకొన్నారు. అయితే తమ మధ్య విభేదాలకు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకొన్నట్టు కనిపిస్తున్నది. తాప్సీ ప్రతిభను ప్రశంసిస్తూ కంగన ట్వీట్ చేయడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇటీవల సినీ అవార్డుల కార్యక్రమంలో తాప్సీ పన్నుకు ఉత్తమ నటి అవార్డును గెలుచుకొన్నారు. ఈ ట్రోఫిని అంగీకరిస్తూ.. ఆ అవార్డు నామినేట్ అయిన దీపిక పదుకోన్, విద్యాబాలన్, జాన్వీ కపూర్, కంగన రనౌత్‌ను అభినందించారు. నటన అనే సరిహద్దును మరో లెవెల్‌కు తీసుకెళ్లావు. ప్రతీ ఏడాది నీ పెర్ఫార్మెన్స్‌ను పెంచుకొంటూ మైలురాయిగా నిలిచావు అంటూ అన్నారు.

తాప్పీ పన్ను ప్రశంసను స్వీకరిస్తూ కంగన రనౌత్ స్పందించారు. థ్యాంక్యూ తాప్సీ.. విమల్ ఇలాయిచీ ఫిలింఫేర్ అవార్డుకు అర్హురాలివి. నీకంటే ఎవరూ దానికి అర్హులు లేరు అంటూ కంగన ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నది.
తాప్సీ కెరీర్ విషయానికి వస్తే 2020లో తప్పడ్ సినిమాతో అవార్డులు, రివార్డులు అందుకొంటున్న తాప్సీ ప్రస్తుతం మిథాలి రాజ్ బయోపిక్‌లో నటిస్తున్నారు. కంగన రనౌత్ విషయానికి వస్తే జయలలిత జీవితం ఆధారంగా వస్తున్న తలైవి చిత్రంలో కంగన రనౌత్ నటిస్తున్నారు. కరోనావైరస్ విజృంభిస్తున్న కారణంగా ఈ సినిమాను వాయిదా వేశారు. దాకడ్, తేజాస్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











