నేను కొడితే.. నా పెళ్లాం తిరిగి చెంప చెళ్లుమనిపిస్తుంది.. డైరెక్టర్‌ను కడిగిపారేసిన తాప్సీ

బాలీవుడ్‌లో ప్రస్తుతం భాగీ3, తప్పడ్ అనే రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. టైగర్ ష్రాఫ్ నటించిన భాగీ3 సినిమాకు కొరియోగ్రాఫర్ ఆహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించగా.. తప్పడ్ సినిమాలో తాప్సీ పన్ను కీలక పాత్రను పోషించారు. అయితే భాగీ3 సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. తప్పడ్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో తాప్సీ పన్ను ఘాటుగా స్పందించింది. ఇంతకు ఆహ్మద్ ఖాన్ ఏమన్నారంటే..

భాగీ3 ప్రమోషన్‌లో తప్పడ్ సినిమాపై

భాగీ3 ప్రమోషన్‌లో తప్పడ్ సినిమాపై

భాగీ3 ప్రమోషన్‌లో తప్పడ్ సినిమాపై ఆహ్మద్ ఖాన్ నోరు పారేసుకోవడం బాలీవుడ్‌లో చర్చకు దారి తీసింది. తప్పడ్ సినిమాను ఉద్దేశించి మాట్లాడుతూ.. భర్త చెంప దెబ్బ (తప్పడ్) కొడితే భార్య వదిలేసి వెళ్తుందా? ఈ సినిమా కథేంటో చాలా వింతగా ఉంది. ఏంటో ఆ సినిమా కథ. ఒకవేళ భార్యకు అది సమస్యగా అనిపిస్తే.. భర్త చెంపలు వాయిస్తుంది అంటూ ఆహ్మద్ ఖాన్ నోటి దురుసును ప్రదర్శించాడు.

ఎక్కడైనా భార్యభర్తలు విడిపోతారా

ఎక్కడైనా భార్యభర్తలు విడిపోతారా

ఒక చెంపదెబ్బ కారణంగా భార్య,భర్తల వైవాహిక జీవితానికి భంగం కలుగుతుందా? చెంపదెబ్బ కారణంగా ఎక్కడైనా భార్యభర్తలు విడిపోతారా? ఒప్పుడైనా నా భార్యను నేను కొడితే.. వెంటనే నన్ను తిరిగి చెంపలు వాయిస్తుంది. అంతటితో ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని ఆహ్మద్ ఖాన్ అన్నారు.

ఇలాంటి కథలతో కూడా సినిమాలా?

ఇలాంటి కథలతో కూడా సినిమాలా?

చిన్న చిన్న సమస్యలను కూడా కథలుగా రాస్తున్నారు. ఆ సినిమాను చూస్తే.. ఒక్కొక్కరిది ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూ.. ఎవరి ఆలోచనలు వారివి. ఇలాంటి కథలతో కూడా సినిమాలు వస్తున్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఆహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఆహ్మద్ ఖాన్‌పై తాప్సీ గరం అయ్యారు.

Recommended Video

Taapsee Pannu Admits She's In A Relationship || సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్‌తో హీరోయిన్ తాప్సీ డేటింగ్
 ఏదైతే కరెక్ట్‌గా అనిపిస్తుందో

ఏదైతే కరెక్ట్‌గా అనిపిస్తుందో

దర్శకుడు, కొరియోగ్రాఫర్ ఆహ్మద్ ఖాన్ వ్యాఖ్యలపై తాప్సీ స్పందిస్తూ.. తనకు ఏదైతే కరెక్ట్‌గా అనిపిస్తుందో ఆ కథతోనే ఆయన సినిమాలు తీస్తాడు. మా విషయంలో కూడా అంతే.. మాకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో.. ఆ కథనే సినిమాగా తీశాం. జీవితంలో చాలా రకాల బంధాలను చూస్తాం. ఆ బంధాల్లో ప్రేమ, గౌరవం దాగి ఉంటుంది. ఎవరి సౌకర్యార్థం, అవగాహనను బట్టి వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. అంతా మాత్రాన ఇతరులను కించపరిచే విధంగా తనకు తోచినట్టు మాట్లాడటం సరికాదు అని తాప్సీ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X