అలాంటి నమ్మకాన్ని కలిగించిన చిత్రమదే.. హీరోయిన్ కామెంట్స్
ఒక్కోసారి కథ, స్క్రిప్ట్‌పై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. కానీ ఫలితం మాత్రం భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు స్క్రిప్ట్, కథపై నమ్మకం లేకపోయినా ఫలితం మాత్రం బాగుంటుంది. అయితే తనకు ఓ చిత్రం ద్వారా తన మీద తనకే నమ్మకం వచ్చిందని, స్క్రిప్ట్‌ను నమ్మి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా ఓకే చేశానని నాటి సంగతులను గుర్తు చేసుకుంది.
తాప్సీ హీరోయిన్‌గా వచ్చిన ఆనందో బ్రహ్మా చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. హారర్ ప్లస్ కామెడీ సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో ఆనందో బ్రహ్మ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ ఏడాది వచ్చిన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాప్సీ ఈ చిత్ర విశేషాలను పంచుకుంటూ షూటింగ్ లొకేషన్‌లో దిగిన ఫోటోను షేర్ చేసింది.

ఆనందో బ్రహ్మ గురించి చెబుతూ.. 'ఈ చిత్రం నా కెరీర్‌లో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది, ఎందుకంటే ఇది నాకు పూర్తి నమ్మకం ఉన్న స్క్రిప్ట్‌కు మద్దతు ఇవ్వగలిగే ధైర్యముందని నేర్పింది. ఈ విధంగా నాపై నాకు విశ్వాసం కలిగించింది. మొదటిసారిగా ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్‌ను తీసుకోలేదు. ఎందుకంటే అది భారంగా మారకూడదు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాకే మేమంతా రెమ్యూనరేషన్ తీసుకున్నాము. సూపర్ ఫన్ టీం, సూపర్ ఫన్ ఎక్స్‌పీరియన్స్, మరియు సూపర్ ఫన్ ఫిల్మ్ .. విజయ్, శశి, మాహిలకు చీర్స్' అంటూ నాటి విషయాలను పంచుకుంది.


Click it and Unblock the Notifications











