Don't Miss!
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్‌పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్‌ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్‌లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- News ఆ నలుగురిపై టీడీపీ గురి - జగన్ సమర్ధతకు సవాల్..!!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరోసారి రెమ్యునరేషన్ డోస్ పెంచిన తాప్సి.. మొత్తం ఆదాయం ఎంతో తెలుసా?
గ్లామరస్ బ్యూటీ తాప్సి అదృష్టం అనేది చాలా భిన్నంగా ఉంది. బాలీవుడ్ లో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఆమె తలరాతే మారిపోయింది. వీలైనంత వరకు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ జనాలను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక ఇటీవల ఆమె రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. తాప్సి ఆదాయంపై బాలీవుడ్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఆ విధంగా ఆఫర్స్ పట్టేస్తున్న తాప్సి
నటీనటులు ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక పాయింట్ హైలెట్ అయ్యేలా ఉండాలి. అప్పుడే సినిమా ప్లాప్ అయినా కూడా డిఫరెంట్ గా ట్రై చేశారనే కామెంట్స్ అందుతాయి. ఈ రోజుల్లో నటిమణులకు అది చాలా అవసరం. అదే తరహాలో తాప్సి బాలీవుడ్ లో ఆఫర్స్ అందుకుంటోంది. చేసి ప్రతి సినిమాలో తన పాత్ర రొటీన్ గా ఉండకుండా జాగ్రత్త పడుతోంది.
సెకండ్ హీరోయిన్ గా
తాప్సి పన్ను 2010లో ఝుమ్మంది నాథం సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ అవ్వకపోవడంతో తాప్సికి చెప్పుకోదగ్గ అవకశాలు రాలేవు. కొన్ని సమయాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది.
ఆ సినిమాలతో మంచి గుర్తింపు
ఇక టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత ప్రయత్నం చేసినా కూడా లాభం లేదని అనుకున్న తాప్సి తన ఆలోచన విధానాన్ని మార్చేసి బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ ఆమె చేసిన సినిమాలు చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. పింక్ తప్పడ్ వంటి సినిమాలు మంచి గుర్తింపును అంధించాయి.
రెమ్యునరేషన్ ఎంతంటే..
ఇక ఇటీవల తాప్సి రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. గత ఏడాది కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తూ వచ్చిన తాప్సి ఇప్పుడు 2కోట్లకు చేరువలో ఉన్నట్లు సమాచారం. కొన్ని సినిమాలకు బడ్జెట్ ను బట్టి కూడా డిమాండ్ చేస్తోందట. ఇక చిన్న సినిమాల్లో పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ కూడా తగ్గిస్తోందట.
మొత్తం ఆదాయం ఎంతంటే?
కేవలం సినిమాలతోనే కాకుండా తాప్సి ఇతర యాడ్స్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది. లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసినప్పుడు లాభాల్లో కూడా వాటా అందుకుంటోందట. ఇక మొత్తం ఏడాదిలో ఆమె ఆదాయం 40కోట్లు దాటుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. చూస్తుంటే తాప్సి త్వరలోనే బాలీవుడ్ అగ్ర నటీనటులకు గట్టిపోటీని ఇచ్చేలా ఉన్నట్లు అర్ధమవుతోంది.